ఐపీఎల్-2021 గండం: చెన్నై సూపర్ కింగ్స్‌ను క్లీన్ చేయడం ఖాయం? ధోనీ సహా? ఆ నలుగురిపై చూపు?

చెన్నై: ఐపీఎల్-2020. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు పీడకలను మిగల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా అత్యంత అవమానకరంగా ధోనీసేన ఈ మెగా టోర్నమెంట్‌ను వైదొలగడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ప్రపంచానికి కరోనా వైరస్ పట్టుకున్నట్టు.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందు టైటిల్ హాట్ ఫేవరెట్‌గా కనిపించిన చెన్నై సింహాలు.. సగం మ్యాచ్‌లను ఆడేసరికి చతికిలపడ్డారు. ఘోరంగా ఓటమి పాలవుతున్నారు. ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నారు.

పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో..

పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో..

నిజానికి- చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న తరువాత కూడా ఈ స్థాయిలో పరాభవాన్ని చవి చూడలేదా జట్టు. ఫిక్సింగ్ ఆరోపణల వల్ల ఐపీఎల్ టోర్నమెంట్‌లో నిషేధానికి గురైన ఆ రెండేళ్ల సీజన్‌ను పక్కన పెడితే.. ప్రతీసారీ తనదైన ముద్రను వేస్తూ వచ్చింది. టోర్నమెంట్‌పై ఆధిపత్యాన్ని చలాయించింది. ప్రతీసారీ ప్లేఆఫ్‌లో అడుగు పెట్టింది. 2010, 2011, 2018ల్లో టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. 2008, 2012, 2013, 2015, 2019ల్లో రన్నరప్‌గా నిలిచింది.

ఎనిమిదో స్థానంతోనే సరి..

ఎనిమిదో స్థానంతోనే సరి..

ఇంత అద్భుతమైన రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సారి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరుకుంటుందని సగటు అభిమాని ఊహకు ఏ మాత్రం అందని విషయం. ఈ టోర్నమెంట్‌లో ఆ జట్టు ముందుకు సాగుతుందనే ఆశలు కూడా ఎవరికీ లేవు. అలాంటిదేదైనా జరిగితే.. అది అద్భుతమే అవుతుంది. ఈ టోర్నమెంట్‌లో ఏడు, లేదా ఎనిమిది స్థానాలతోనే సరిపెట్టుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరో నాలుగు మ్యాచులను ఆడాల్సి ఉండగా.. విజయాలపై ఆశలు మాత్రం ఉండట్లేదు అభిమానులకు.

2021 నాటికి భారీగా ప్రక్షాళన..

2021 నాటికి భారీగా ప్రక్షాళన..

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శనపై టీమ్ మేనేజ్‌మెంట్ ఏ మాత్రం సంతృప్తికరంగా ఉండట్లేదనేది బహిరంగ రహస్యం. జట్టు ప్రదర్శన అత్యంత నాసిరకంగా ఉండటం పట్ల ఆగ్రహాన్ని, అసంతృప్తినీ వ్యక్తం చేస్తోందని చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్-2021 నాటికి భారీగా ప్రక్షాళన చేయడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వొచ్చని అంటున్నారు. కేదార్ జాదవ్, పియూష్ చావ్లా, ఇమ్రాన్ తాహిర్‌లను వదులుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సురేష్ రైనా, హర్భజన్ సింగ్‌లతో కూడా కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేసుకోదలచుకోలేకపోవచ్చని చెబుతున్నారు.

కేన్, ఫించ్‌లపై చూపు

కేన్, ఫించ్‌లపై చూపు

తొలగించిన వారి స్థానంలో కొత్త ప్లేయర్లను తీసుకోవడానికి అవకాశం ఉందనే అంచనాలు ఇప్పటి నుంచే వెలువడుతున్నాయి. కేన్ విలియమ్సన్ (సన్‌రైజన్స్ హైదరాబాద్), ఆరోన్ ఫించ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ఇవాన్ మోర్గాన్‌లను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతుం జట్టులో కొనసాగుతోన్న ఫాప్ డుప్లెసిస్‌ను కొనసాగిస్తూనే అతనికి కేప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలనే అంచనా ఉన్నట్లు తెలుస్తోంది. ధోనీని తొలగించాల్సి వస్తే.. కేన్ విలియమ్సన్, ఇవాన్ మోర్గాన్, డుప్లెసిస్‌లకు ఆ పగ్గాలను అందివ్వాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, October 22, 2020, 11:58 [IST]
Other articles published on Oct 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X