For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ.. జాదవ్ ఔట్!!

IPL 2020, CSK vs RCB: Royal Challengers Bangalore have won the toss and have opted to bat

దుబాయ్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌-13లో మరికొద్ది సేపట్లో మరో బిగ్‌ఫైట్‌ జరగనున్నది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు దుబాయ్‌ వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది. క్రిస్ మోరిస్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు చెన్నై ఒక మార్పుతో ఆడనుంది. వరుసగా విఫలమవుతున్న కేదార్ జాదవ్ స్థానంలో ఎన్ జగదీశన్ ఆడుతున్నాడు.

ఈ మ్యాచ్‌ ద్వారా ఇరుజట్లు మళ్లీ గాడిలో పడాలని భావిస్తున్నాయి. వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి గాడిలో పడాలని భావిస్తోంది. విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో బెంగళూరు బ్యాటింగ్‌ బలం మరింత పెరిగింది. సీజన్‌లో ఎంఎస్ ధోనీ పేలవ ఆటతోనే చెన్నై ఓటములను ఎదుర్కొంటున్నది. గత మ్యాచ్‌లో ధోనీ వైఫల్యంతోనే గెలిచే మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమిని చవిచూసింది. సీఎస్‌కే జట్టు కెప్టెన్‌ ధోని గాడిలో పడితే బ్యాటింగ్‌ సమస్య కొంతవరకూ తీరుతుంది.

ఇప్పటివరకూ ఇరుజట్ల మధ్య 25 మ్యాచ్‌లు జరగ్గా అందులో సీఎస్‌కే 16 మ్యాచ్‌ల్లో గెలవగా, ఆర్సీబీ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. సీఎస్‌కే ఎక్కువగా ఫాఫ్ డుప్లెసిస్‌, షేన్ వాట్సన్‌, శార్దూల్‌ ఠాకూర్‌లపైనే ఆధారపడుతుండగా .. ఆర్సీబీలో దేవదత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, యుజ్వేంద్ర చహల్‌లే కీలకం. ఏది ఏమైనా ధోనీ వర్సెస్‌ కోహ్లీల మ్యాచ్‌ కావడంతో మంచి మజానా ఆస్వాదించవచ్చు.

తుది జట్లు:
బెంగళూరు: దేవదత్‌ పడిక్కల్‌, ఆరోన్‌ ఫించ్‌, విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, గురుకీరత్‌ సింగ్‌, శివమ్‌ దూబె, క్రిస్‌ మోరిస్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉరుసు ఉదాన, నవదీప్‌ సైని, యుజువేంద్ర చాహల్‌.

చెన్నై: షేన్‌ వాట్సన్‌, ఫాఫ్ డుప్లెసిస్‌, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, ఎన్ జగదీశన్‌, సామ్‌ కరన్‌, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, కర్ణ్ శర్మ.

Story first published: Saturday, October 10, 2020, 19:21 [IST]
Other articles published on Oct 10, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+