Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రవీంద్ర జడేజా ఖేల్ ఖతం: సర్ విషయంలో జరిగింది ఇదే: ఇంత నాసిరకంగానా

Chennai Super Kings Captaincy pressure destroys Ravindra Jadejas personal form.

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ మరో ఓటమిని మూటగట్టుకుంది. హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది ఈ టీమ్.. ఆ స్థాయిలో ఆడట్లేదు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా బోణీ కొట్టనే లేదు. ఆడిన తొలి మూడు మ్యాచ్‌లల్లోనూ ఘోర పరాజయాలను చవి చూసింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్..రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఇప్పుడు తాజాగా పంజాబ్ కింగ్స్ చేతుల్లో పరాభవం పొందింది. ఇది ఇక్కడితో ఆగుతుందనే గ్యారంటీ సైతం ఉండట్లేదు.

ధోనీ వారసుడిగా

ధోనీ వారసుడిగా

మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు రవీంద్ర జడేజా. చివరి నిమిషంలో అతను సారధ్య బాధ్యతలను అందుకున్నాడు. టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఆయనను కేప్టెన్‌గా ప్రకటించింది ఫ్రాంఛైజీ. సరిగ్గా రెండు రోజుల ముందు ఈ పరిణామాల చోటు చేసుకున్నాయి. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ధోనీ ప్రకటించడం.. తన వారసుడిగా రవీంద్ర జడేజాను ఎంపిక చేయాలని ఫ్రాంఛైజీకి సూచించడం.. దానికి మేనేజ్‌మెంట్ అంగీకరించడం చకచకా సాగిపోయాయి.

అనుభవ లేమి..

అనుభవ లేమి..

అంతకుముందు కెప్టెన్‌ వ్యవహరించిన అనుభవం రవీంద్ర జడేజాకు లేదు. తన కెరీర్‌లో ఏ రోజు కూడా అతను జట్టును ముందుండి నడిపించన సందర్భాలు లేవు. కనీసం వైస్ కేప్టెన్‌గా అయినా.. స్టాండ్ బైగా అయినా కేప్టెన్‌గా రవీంద్ర జడేజా పని చేయలేదు. అలాంటిది రాత్రికి రాత్రి సెకెండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుకు కేప్టెన్సీ బాధ్యతలను స్వీకరించడం అంటే మాటలు కాదు. జట్టును ముందుండి నడిపించడం అనేది అసలు సిసలు సవాల్‌.

జడేజా విషయంలో జరిగిందిదే..

జడేజా విషయంలో జరిగిందిదే..

సాధారణంగా ఏ కేప్టెన్‌ అయినా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడం సాధారణమే. ఈ బాధ్యతల వల్ల తన వ్యక్తిగత ప్రదర్శనను కూడా కొన్ని సందర్భాల్లో పణంగా పెట్టాల్సి వస్తుంది. జడేజా విషయంలో అదే జరిగింది. ఒక్క రోజు కూడా కేప్టెన్‌గా వ్యవహరించని ప్లేయర్‌కు ఒక్కసారిగా ఓ మెగా ఈవెంట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టు బాద్యతలను అప్పగించడం- అతని వ్యక్తిగత ప్రదర్శనను సైతం దెబ్బతీసింది. బ్యాటింగ్ చేయలేక.. బౌలింగ్ వేయలేక తీవ్రంగా సతమతమౌతున్నాడీ ఆల్‌రౌండర్.

 ఘన వారసత్వం..

ఘన వారసత్వం..

2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తో అసోసియేట్ అయి ఉన్నాడు రవీంద్ర జడేజా. ఈ టీమ్ తరఫున ఇప్పటివరకు ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లాడి 2,386 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ రాణించాడు. 128 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడా టాలెంట్ అంతా కేప్టెన్సీ దెబ్బకు ధ్వంసమైనట్టే కనిపిస్తోంది. ధోనీ వారసుడిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో మ్యాచ్ మ్యాచ్‌కూ అతను నీరసించిపోతున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ కావడం దీనికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు.

Story first published: Monday, April 4, 2022, 12:47 [IST]
Other articles published on Apr 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+