ఇరగదీసిన ఇషాన్ కిషన్.. అద్భుత విజయంతో అగ్రస్థానంలో ముంబై..అట్టడుగున చెన్నై!

షార్జా: ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ముంబై 10 వికెట్ల తేడాతో చెన్నైసూపర్ కింగ్స్‌ను చిత్తుచేసింది. ఇషాన్ కిషన్(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్), క్వింటన్ డికాక్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో చెన్నై విధంచిన 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులువుగా చేధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ట్రెంట్ బౌల్ట్(4/18), జస్ ప్రీత్ బుమ్రా(2/25), రాహుల్ చాహర్ (2/22) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది. సామకరన్ (42 బంతుల్లో 4 ఫోర్, 2 సిక్స్‌లతో 52) మినహా అంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం చెన్నై ఓపెనర్ల సూపర్ బ్యాటింగ్‌తో 12.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసి ఘనవిజయాన్నందుకుంది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించగా.. చెన్నై ఆఖరి స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ విజయంతో ఈ సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ముంబై ప్రతీకారం తీర్చుకుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, October 23, 2020, 22:36 [IST]
Other articles published on Oct 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X