For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs KKR: నితీశ్‌ రాణా అర్ధ శతకం.. చెన్నై లక్ష్యం 173!!

IPL 2020, CSK vs KKR: Nitish Rana 87 helps Kolkata Knight Riders to 172 for 5

దుబాయ్‌: దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పోరాడే స్కోరు చేసింది. ఓపెనర్‌ నితీశ్‌ రాణా (87: 61 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు) అర్ధ శతకంతో రాణించడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 రన్స్ చేసి.. చెన్నై ముందు 173 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ ‌(26: 17 బంతుల్లో 4ఫోర్లు), చివరలో దినేశ్‌ కార్తీక్ ‌(21 నాటౌట్:‌ 10 బంతుల్లో 3ఫోర్లు) విజృంభించడంతో కోల్‌కతా పటిష్ఠ స్థితిలో నిలిచింది. కోల్‌కతా కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ (15) దూకుడుగా ఆడలేకపోయాడు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా..మిచెల్ సాంట్నర్‌, రవీంద్ర జడేజా, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ పడగొట్టారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతాకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణాలు చెలరేగి ఆడారు. దీంతో పవర్‌ప్లే ఆఖరికి కోల్‌కతా 48/0తో నిలిచింది. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. విరామం తర్వాత చెన్నై కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ లెగ్‌ స్పిన్నర్‌ కర్ణ్‌ శర్మకు బౌలింగ్‌ ఇచ్చాడు. ఆ ఓవర్‌ రెండో బంతికే గిల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్‌ (7) ఒక సిక్సర్‌ బాదినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాత రింకూ సింగ్‌ 11 (11) తనకు వచ్చిన తొలి మ్యాచ్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

వికెట్లు పడుతుండటంతో రాణా నిదానంగా ఆడాడు. కాసేపటి తర్వాత ఒక్కసారిగా గేరు మార్చాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాది జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జోరు కొనసాగించిన రాణా 44 బంతుల్లో 7ఫోర్లు, సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌ సహకారం అందించకపోయినా స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగించాడు. శర్మ వేసిన 16వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఊపు మీద కనిపిస్తున్న రాణాను ఎంగిడి ఔట్‌ చేశాడు. ఎంగిడి వేసిన 18వ ఓవర్‌ తొలి బంతిని రాణా భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి సామ్‌ కరన్‌ చేతికి చిక్కాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ అప్పటికే క్రీజులో ఉన్న కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌తో కలిసి ఎడాపెడా బౌండరీలు బాదాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో మోర్గాన్‌ 15 (12) ఔటయ్యాడు. ఆఖర్లో కార్తీక్‌ 21 (10 బంతుల్లో 3ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీశాడు.

Story first published: Thursday, October 29, 2020, 21:33 [IST]
Other articles published on Oct 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+