కరోనా కారణంగానే అతని సత్తాను అంచనా వేయలేకపోయాం: ధోనీ

CSK vs KKR : Ruturaj Gaikwad Wins MS Dhoni's Praise, CSK have A Spark To Hopes For Next Season

దుబాయ్: కరోనా కారణంగానే యువ బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని అంచనా వేయలేకపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ తెలిపాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(72) సూపర్ హాఫ్ సెంచరీకి తోడు ఆఖర్లో రవింద్ర జడేజా(31 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో చెన్నై అద్భుత విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ.. రుతురాజ్ గైక్వాడ్‌, జడేలాలపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఒక్క మ్యాచ్‌ చివర్లోనే తమకు కలిసి వచ్చిందని చెప్పాడు.

జడేజాకు అండగా ఒకరుంటే..

జడేజాకు అండగా ఒకరుంటే..

‘ఈ ఒక్క మ్యాచ్ క్లైమాక్స్‌లోనే మాకు కలిసి వచ్చిందనుకుంటా. ఈ క్రెడిట్‌ అంతా మా ఆటగాళ్లదే. ఈ సీజన్‌లో జడేజా అద్భుతంగా ఆడుతున్నాడు. మా జట్టులో డెత్‌ ఓవర్లలో అతనొక్కడే బాగా రాణిస్తున్నాడు. కానీ అతనికి సహకారం అందించే వ్యక్తి లేడు. జడేజాకు సరైన బ్యాట్స్‌మన్‌ తోడైతే చెన్నైకు కలిసి వచ్చేది. అవకాశాలు రాని ఆటగాళ్లను ఆడించాలనుకున్నాం. అందులో భాగంగానే రుతురాజ్‌కు అవకాశం కల్పించాం. అతను తన సత్తా చాటాడు'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

 రుతురాజ్ ఎక్కువగా మాట్లాడడు..

రుతురాజ్ ఎక్కువగా మాట్లాడడు..

తాము దుబాయ్ చేరుకోగానే రుతురాజ్‌ కరోనా బారిన పడ్డాడని, దాంతో అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని అంచనా వేసే సమయం తమకు లభించలేదని ధోనీ చెప్పుకొచ్చాడు. ‘రుతురాజ్ తనలోని సత్తాను చాటుకున్నాడు. అయితే మేం ఇక్కడికి రాగానే రుతురాజ్ కరోనా బారిన పడ్డాడు. దాంతో అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని అంచనా వేయలేకపోయాం. ఇతర ఆటగాళ్లలా అతనెక్కువగా మాట్లాడడు. ఒకసారి బరిలోకి దిగితే ఒత్తిడిని తట్టుకోవాలి.

అతడికి తొలి మ్యాచ్‌లో అవకాశం ఇచ్చినప్పుడు డకౌట్ అయ్యాడు. ఒక ఆటగాడిని అంచనా వేయాలంటే ఒక బంతి సరిపోదు. ఇప్పుడు తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంటాడు. జట్టుగా ఇప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మాకు ప్లేఆఫ్స్‌ చేరే పరిస్థితి లేకపోయినా, రాబోయే సీజన్లలో సరైన ఆటగాళ్లు మాకున్నారు' అని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు.

కోల్‌కతాకు చెన్నై దెబ్బ..

కోల్‌కతాకు చెన్నై దెబ్బ..

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (61 బంతుల్లో 87; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. ఇన్‌గిడి 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రుతురాజ్‌ గైక్వాడ్‌ (53 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెన్నై గెలిచేందుకు అవసరమైన ఇన్నింగ్స్‌ ఆడేయగా... జడేజా ఆఖర్లో సిక్సర్లతో జట్టును గెలిపించాడు. రాయుడు (20 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు.

ఈ ఓటమితో కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ఇప్పటికి 13 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆ జట్టు 12 పాయింట్లతో కొనసాగుతోంది. తదుపరి దశకు చేరుకోవాలంటే ఆఖరి మ్యాచ్‌ గెలవడమే కాకుండా రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, అదంత సులువు కాదు.

KXIP vs RR: చావో రేవో మ్యాచ్.. రాజస్థాన్‌పై పంజాబ్ ప్రతీకారం తీర్చుకునెనా? సిక్సర్ కొట్టెనా?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, October 30, 2020, 15:54 [IST]
Other articles published on Oct 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X