CSK vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ.. మూడు మార్పులతో బరిలోకి చెన్నై!!

దుబాయ్:‌ దుబాయ్:‌ ఐపీఎల్‌ 2020 ప్లేఆఫ్‌ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఎంఎస్‌ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్‌ బెర్తు అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని కోల్‌కతా భావిస్తోంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, మోను కుమార్ స్థానంలో షేన్ వాట్సన్, లుంగి ఎంగిడి, కర్ణ్‌ శర్మ జట్టులోకి వచ్చారు.

మరోవైపు కోల్‌కతా సారథి ఇయాన్‌ మోర్గాన్‌ ఒక మార్పు చేశాడు. ప్రసిద్ కృష్ణ స్థానంలో రింకు సింగ్ ఆడనున్నాడు. ఆండ్రీ రస్సెల్ ఇంకా ఫిట్‌గా లేని కారణంగా ఈ మ్యాచ్ ఆడట్లేదు. ఇప్పటికే ప్లే ఆఫ్‌ అవకాశాలు కోల్పోయిన చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచినా.. ఓడినా పెద్దగా ఒరిగేదేంలేదు. కానీ కేకేఆర్‌కు మాత్రం సంకట స్థితి అనే చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కేకేఆర్‌కు ప్లేఆఫ్‌ అవకాశాలు ఉంటాయి.

ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన కేకేఆర్‌ 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్లు కలిగి ఉంది. మరోవైపు 12 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 8 ఓటములతో చివరిస్థానంలో నిలిచిన సీఎస్‌కేకు ప్లేఆఫ్‌ దారులు ఎప్పుడో మూసుకుపోయాయి. ప్రస్తుతం 12 పాయింట్లతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో కేకేఆర్‌ సమానంగా ఉంది. రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా పంజాబ్‌ నాలుగులో ఉండగా.. కోల్‌కతా ఐదో స్థానంలో నిలిచింది.

తుది జట్లు:

చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్‌, షేన్‌ వాట్సన్‌, అంబాటి రాయుడు, ధోనీ(కెప్టెన్‌), జగదీశన్‌, సామ్‌ కరన్‌, రవీంద్ర జడేజా, శాంట్నర్‌, కరణ్‌ శర్మ, దీపక్‌ చాహర్‌, లుంగీ ఎంగిడి

కోల్‌కతా: శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి, దినేశ్‌ కార్తీక్‌(వికెట్‌ కీపర్‌), మోర్గాన్‌(కెప్టెన్‌), రింకూ సింగ్‌, సునీల్‌ నరైన్‌, కమిన్స్‌, ఫెర్గూసన్‌, నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, October 29, 2020, 19:18 [IST]
Other articles published on Oct 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X