
చాహర్‌కు కరోనా?:
సీఎస్‌కే జట్టులో వైరస్ సోకిన పేసర్ పేరు శుక్రవారం బయటకు రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం భారత్ తరపున ఆడుతున్న కుడి చేతివాటం పేసర్ దీపక్ చాహర్‌కే కరోనా సోకిందని తెలిసింది. వెంటనే అప్రమత్తమైన సీఎస్‌కే యాజమాన్యం అతన్ని క్వారంటైన్‌లో ఉంచింది. బౌలర్ పేరుని అధికారికంగా ఆ ఫ్రాంఛైజీ శుక్రవారం ప్రకటించలేదు. ఇక చాహర్‌లో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని సమాచారం. మరోవైపు 10 మంది సహాయక సిబ్బంది కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. వైరస్ సోకిన అందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందట.

14 రోజులు క్వారంటైన్‌లో:
సీఎస్‌కే జట్టులో పాజిటివ్‌గా తేలిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. అదనంగా వారం నుండి రెండు వారల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. అనంతరం రెండు సార్లు ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించి అందులో నెగిటివ్‌గా తేలితేనే వారిని బయో సెక్యూర్ వాతావరణంలోకి అనుమతించనున్నారు. ఇదిలాఉంటే.. పాజిటివ్‌గా తేలిన వారిలో ఎవరిలోనూ వైరస్ లక్షణాలు లేకపోవడం ఒకింత ఆందోళన కల్గిస్తున్నది. వీరితో ఎవరు కాంటాక్టు అయ్యారు అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

చెన్నైలో క్యాంప్:
ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈకి వచ్చే ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకి చెన్నైలో ఓ క్యాంప్‌ని సీఎస్‌కే ఫ్రాంఛైజీ ఏర్పాటు చేసింది. ఆ క్యాంప్‌నకి ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, కర్ణ్ శర్మ, దీపక్ చాహర్‌తో పాటు కీలకమైన ఆటగాళ్లని స్పెషల్ ఛార్టర్డ్ ప్లైట్‌లో ఆ ఫ్రాంఛైజీ తరలించింది. ఇప్పుడు ఆ క్యాంప్ చెన్నై టీమ్‌కి తలనొప్పిగా మారింది. టోర్నీలో మొత్తం 8 జట్లు ఉండగా.. చెన్నై ఫ్రాంఛైజీ మాత్రమే క్యాంప్‌ని భారత్‌లో ఏర్పాటు చేసింది. దాంతో ఇప్పుడు ఆ జట్టు మినహా.. మిగిలిన అన్ని జట్లూ యూఏఈలో కరోనా వైరస్ టెస్టుల్లో పాసయ్యాయి.

షెడ్యూల్ ఆలస్యం:
మరో మూడు వారాల్లో ఐపీఎల్ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో తాజా పరిణామం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి ఆందోళన కలిగించేదే. ఇక ఐపీఎల్ 2020 షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం విడుదల చేయనున్నట్లు శుక్రవారం తెలిసింది. అయితే తాజా పరిమాణాల నేపథ్యంలో ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదలను బీసీసీఐ నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ విడుదల చేయనుంది. 'పరిస్థితిని పరిష్కరించడానికి తగిన చర్యలు మా వద్ద ఉన్నాయి. ఐపీఎల్ టోర్నీకి ప్రస్తుతం వచ్చిన ముప్పేమీ లేదు. అయితే తాజా పరిమాణాల నేపథ్యంలో ఐపీఎల్ 2020 షెడ్యూల్ ప్రకటన ఆలస్యం కానుంది' అని బీసీసీఐ ఉన్నతాధికారులు టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.


Click it and Unblock the Notifications












