న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీకి ఇదే ఆఖరి సీజనా.. ఇదిగో సంకేతాలు!!

IPL 2020: CSK Captain MS Dhoni Retiring from IPL?

హైదరాబాద్: ఐపీఎల్ 2020‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని పరాజయాలు ఎదురయ్యాయి. 12 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు మాత్రమే సాధించిన చెన్నై పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచులలో గెలిచినా ప్లే ఆప్స్ వెళ్లలేదు. చెన్నై సారథి ఎంఎస్ ధోనీ నిర్ణయాలే జట్టు ఓటమికి కారణమని, ఫామ్‌లో లేని సీనియర్ ఆటగాళ్లకు పదే పదే అవకాశాలిచ్చి మూల్యం చెల్లించుకున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడంపై కూడా కొందరు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌ కోసం జట్టులో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని వయసు మీద పడిన వారికి ఉద్వాసన పలుకుతారని ప్రచారం జరుగుతోంది.

జోస్‌ బట్లర్‌కు జెర్సీ:

జోస్‌ బట్లర్‌కు జెర్సీ:

జట్టులో ఎవరు ఉన్నా.. లేకున్నా ఐపీఎల్ 2021లోనూ ఎంఎస్ ధోనీనే కెప్టెన్‌గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే గత ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మాజీ కెప్టెన్ ధోనీ త్వరలోనే టీ20 మెగా లీగ్‌ నుంచి కూడా తప్పుకోనున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ధోనీ మాటలు, చేతలు రిటైర్మెంట్‌ ఇవ్వబోతున్నాడనే సంకేతాలను ఇస్తున్నాయి. ఇటీవల రాజస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం తన జెర్సీని జోస్‌ బట్లర్‌కు బహుమతిగా ఇచ్చాడు. అయితే ధోనీకి అది 200వ ఐపీఎల్ మ్యాచ్ కావడం, ధోనీకి బట్లర్ పెద్ద అభిమాని కావడంతో ఫ్యాన్స్ ఓకే అనుకున్నారు.

పాండ్యా బ్రదర్స్‌కు:

పాండ్యా బ్రదర్స్‌కు:

ఇక ముంబైతో మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ తన జెర్సీని పాండ్యా బ్రదర్స్‌కు బహూకరించాడు. తన 7వ నంబర్‌ జెర్సీని బహూకరించాడు. ఈ ఫొటోను లీగ్‌ నిర్వహకులు తమ ట్విటర్‌లో పోస్టు చేశారు. చాలా మంది ఆటగాళ్లపై జెర్సీలపై ధోనీ ఆటోగ్రాఫ్‌లిచ్చాడు. ఇక ఓ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ వచ్చే మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తామన్నాడు. ధోనీ చేసిన ఈ వ్యాఖ్యలు, జెర్సీలను గిఫ్టులుగా ఇవ్వడాన్ని బట్టి వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోనీ ఆడటం అనుమానమనే భావన వ్యక్తం అవుతోంది.

అత్యంత పేలవ ప్రదర్శన:

అత్యంత పేలవ ప్రదర్శన:

మరో కారణం కూడా కనిపిస్తోంది. చెన్నై ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోర పరాభవాలతో అనూహ్యంగా నిష్క్రమించనుంది. కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేని పరిస్థితిలో వైదొలగనుంది. దానికి తోడు కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ సైతం ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్నాడు. వీటన్నింటినీ గమనించి త్వరలోనే అతడు ఈ లీగ్‌ నుంచి కూడా తప్పుకుంటాడనే అనుమానం రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే అతడి అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

CSK vs MI : It Does Hurt Where We Are At This Stage In IPL 2020 - MS Dhoni || Oneindia Telugu
ఊహించని రీతిలో రిటైర్మెంట్:

ఊహించని రీతిలో రిటైర్మెంట్:

మరోవైపు ఎంఎస్ ధోనీ ఐపీఎల్ లీగ్‌ తర్వాత బిగ్‌బాష్‌ లీగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అదెంత వరకూ నిజమో తెలియదు. ఇక ఎవరూ ఊహించని రీతిలో మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సింపుల్‌గా ఓ ట్వీట్‌తో నేను రిటైర్ అవుతున్నా అని పేర్కొన్నాడు. టెస్టులకు సైతం మహీ ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇపుడు కూడా అలానే చేస్తాడని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.

RCB vs CSK: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో రికార్డు.. గేల్, ఏబీ తర్వాత ఐదో బ్యాట్స్‌మన్‌గా!!

Story first published: Sunday, October 25, 2020, 21:24 [IST]
Other articles published on Oct 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X