Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వహ్ ధోనీ..ఆ విషయంలో మొనగాడు: వరుస ఓటముల్లోనూ: మనసులు గెలుచుకున్న ప్లేయర్‌గా: ఐఐహెచ్‌బీ

IPL 2020: CSK Captain MS Dhoni leads brand endorsement, say IIHB report

చెన్నై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌ సందర్భంగా.. చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఈ సీజన్‌లో టాప్ మోస్ట్ రీకాల్ వేల్యూ ఉన్న ప్లేయర్‌గా, సెలెబ్రిటీగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఒకవైపు అతను సారథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా ప్రత్యర్థి జట్ల చేతిలో పరాజయాలను మూటగట్టుకుంటున్నప్పటికీ.. ధోనీ వేల్యూ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. మరింత పెరుగుతూ వస్తోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్‌బీ) నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.

892 మంది అభిప్రాయాన్ని సేకరించిన ఐఐహెచ్‌బీ

892 మంది అభిప్రాయాన్ని సేకరించిన ఐఐహెచ్‌బీ

ఈ నెల 4వ తేదీన ఐఐహెచ్‌బీ ఈ సర్వేను నిర్వహించింది. టెలిఫోనిక్ విధానంలో దీన్ని చేపట్టింది. 892 మందిని క్రికెట్ ప్రేమికులను ఎంపిక చేసుకుని, వారి అభిప్రాయాలను సేకరించింది. అత్యధిక వేల్యూ ఉన్న రీకాల్ బ్రాండ్స్, రీకాల్ ప్లేయర్ గురించి అడిగి తెలుసుకుంది. ఐఐహెచ్‌బీ సంస్థ అభిప్రాయాలను సేకరించిన ఈ 892 మంది 15 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారే. వారిలో 59 శాతం మంది పురుషులు, 41 శాతం మంది మహిళలు ఉన్నారు.

టాప్ బ్రాండింగ్‌లో

టాప్ బ్రాండింగ్‌లో

బ్రాండింగ్స్‌లో ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ బైజూస్ టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది. మోస్ట్ స్పాంటేనియస్ రీకాల్డ్‌ బ్రాండ్‌గా నిలిచింది. ఇదే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. మాత్రం మోస్ట్ రీకాల్డ్ సెలెబ్రిటీస్‌లల్లో వెనుకంజలో ఉన్నాడు. బైజూస్ తరువాత.. డ్రీమ్ 11 రెండో స్థానంలో నిలిచింది. డ్రీమ్ 11 ఐపీఎల్-2020 సీజన్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి, ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా థార్, జాబ్ పోర్టల్ అప్‌గ్రేడ్, టాటా అల్ట్రాక్స్.. సంస్థలు హయ్యెస్ట్ రీకాల్ బ్రాండ్స్‌గా నిలిచాయి.

 సెకెండ్ ప్లేస్‌లో

సెకెండ్ ప్లేస్‌లో

మోస్ట్ రీకాల్ ప్లేయర్లలో మహేంద్ర సింగ్ ధోనీ తరువాత.. విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ సర్వేలో విరాట్ కోహ్లీకి రెండో స్థానం దక్కింది. మూడో స్థానంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, నాలుగో స్థానంలో బాలీవుడ్‌కే చెందిన యువ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఉన్నారు. 892 మంది ప్రేక్షకులు, క్రికెట్ ప్రేమికులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఈ జాబితాను రూపొందించింది ఐఐహెచ్‌బీ. ఈ జాబితాలో ధోనీ స్కోర్ 82. ధోనీ ఎండార్స్ చేసిన వాటిల్లో డ్రీమ్ 11 అత్యధిక బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. 79 శాతం బ్రాండింగ్ ఈ సంస్థదే. ఒప్పొ-12 శాతం, ఏఎంఎఫ్ఐ-6 శాతం, ఖాతాబుక్-2 శాతంగా నమోదు అయ్యాయి.

విరాట్ కోహ్లీకి ఎంతంటే..

విరాట్ కోహ్లీకి ఎంతంటే..

విరాట్ కోహ్లీకి 69 శాతం రీకాల్ బ్రాండింగ్ లభించింది. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ 51 శాతాన్ని నమోదు చేశారు. అక్షయ్ కుమార్-67, ఆయుష్మాన్ ఖురానా-55 శాతం మార్క్‌ను సాధించారు. దీనికి సంబంధించిన వివరాలను ఐఐహెచ్‌బీ చీఫ్ మెంటార్ సందీప్ గోయెల్ విడుదల చేశారు. లెన్స్‌కార్ట్, ఎంజీ గ్లోస్టర్, ఫేస్‌బుక్, అమేజాన్, కెల్లాగ్స్, క్రికెట్ డాట్ కామ్ వంటి సంస్థలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయని తెలిపారు. ఫోన్‌పే, స్విగ్గి సంస్థలు బెస్ట్ యాడ్స్‌గా రేటింగ్‌ను సాధించాయని ఆయన ూేర్కొన్నారు.

Story first published: Thursday, October 8, 2020, 15:20 [IST]
Other articles published on Oct 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+