వైరల్ న్యూస్.. కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించబోతున్నారా?!!

దుబాయ్: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. శుక్రవారమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టీమ్ యూఏఈకి చేరుకుంది. దుబాయ్‌లోని వాల్డోర్ఫ్ హోటల్లో ఆ జట్టు బస చేస్తోంది. ఇదిలాఉంటే.. ఐపీఎల్ 2020 సీజన్‌కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ని మార్చబోతున్నారంటూ గత రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆర్‌సీబీ జట్టు చైర్మన్ సంజీవ్ చురివాలా స్పందించారు.

ఓడటం చాలా కామన్:
తాజాగా ఆర్‌సీబీ జట్టు చైర్మన్ సంజీవ్ చురివాలా మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్. అతడు గొప్ప కెప్టెన్, అంతకుమించి మంచి బ్యాట్స్‌మన్. అతనికి ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మా జట్టులో విరాట్ కోహ్లీ ఆడుతుండటం గర్వంగా ఉంది. ఇక మ్యాచ్‌లు గెలవడం.. ఓడటం చాలా కామన్. వ్యక్తిగతంగా విరాట్ కోహ్లీ రికార్డుల్ని మనం మర్చిపోకూడదు. ఆర్సీబీ కెప్టెన్సీ మార్పు అనేది కేవలం రూమర్ మాత్రమే' అని స్పష్టం చేశారు. ఆర్‌సీబీ యజమానిగా విరాట్ మాతో మంచి సంబంధాన్ని కలిగి ఉండడం చాలా గర్వంగా ఉందని సంజీవ్ తెలిపారు.

ప్లే ఆఫ్‌కు రెండు సార్లు మాత్రమే:
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కే విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. కోహ్లీ ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన ఏడు ఎడిషన్లలో కేవలం రెండు సార్లు మాత్రమే జట్టు ప్లే ఆఫ్‌కు వెళ్లింది. వాటిలో 2016లో ఫైనల్‌కు వెళ్లగా.. మిగిలిన సీజన్లలో నిరాశ పరిచింది. గత మూడు సీజన్లలోనూ పాయింట్ల పట్టికలో 8, 6, 8వ స్థానాలతో బెంగళూరు సరిపెట్టింది. దాంతో విరాట్ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎన్నోసార్లు ఐపీఎల్‌లో కోహ్లీ కెప్టెన్సీని తప్పుబట్టాడు.

110 మ్యాచుల్లో నాయతక్వం:
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి ఆర్‌సీబీ టీమ్‌కే ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకూ 177 మ్యాచ్‌లాడి 131.61 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 5,412 పరుగులు చేశాడు. విరాట్ మొత్తం 110 మ్యాచుల్లో ఆర్‌సీబీ జట్టుకు నాయతక్వం వహించాడు. అందులో ఆర్సీబీ 49 గెలువగా.. 55 ఓడిపోయింది. బెంగళూరు టీమ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. సహజంగానే కోహ్లీ ఆధ్వర్యంలో ఆర్‌సీబీ స్థిరమైన పనితీరులో ఉండడం లేదని ఎల్లప్పుడూ ఐపీఎల్ సీజన్‌లో నడిచే చర్చ. అయితే ఆర్‌సీబీ ఫ్రాంజైజీ యజమానులు మాత్రం విరాట్ వెనుక బలంగా నిలబడ్డారు.

ముంబై నుంచి యూఏఈకి:
శుక్రవారం ఆర్‌సీబీ జట్టు బెంగళూరు నుంచి యూఏఈ వెళ్లగా.. అందుకు సంబంధించిన ఫొటోలను ఆటగాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే విరాట్ కోహ్లీ జట్టుతో పాటు వెళ్లలేదట. ముంబై నుంచి ఎక్స్‌క్లూజివ్ చార్టర్ విమానంలో భారత కెప్టెన్ యూఏఈ వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్‌సీబీ జట్టు వెళ్లిన తర్వాతే కోహ్లీ దుబాయ్ వెళ్ళాడట. అక్కడ ప్రాంఛైజీ ఏర్పాటు చేసిన హాటోల్లో ఉన్నాడని తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications