
స్టార్ ఇండియా అసంతృప్తి:
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ షెడ్యూల్‌పై ప్రసారదారు స్టార్ ఇండియా అసంతృప్తితో ఉంది. టోర్నీని మరో వారం రోజులు పొడిగించాలని స్టార్‌స్పోర్ట్స్ డిమాండ్ చేస్తోంది. దీంతో స్టార్ నిర్ణయాలకు అనుగుణంగా షెడ్యూల్‌తో పాటు మ్యాచ్ సమయాల్లో మార్పులు చేయడానికి బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు సమాచారం.

సెప్టెంబర్ 19 నుండే:
స్టార్ ఇండియా ఒత్తిడి నేపథ్యంలో సెప్టెంబర్ 26 నుంచి కాకుండా.. సెప్టెంబర్ 19 నుండే లీగ్ ప్రారంభించాలని బీసీసీఐ చూస్తోందట. ఒకవేళ ఐపీఎల్‌ను సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభిస్తే.. సాయంత్రం మ్యాచ్‌లను తగ్గించే అవకాశం ఉంది. రాత్రి మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు బదులుగా 7.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. దీపావళి (నవంబర్ 14) వరకు టోర్నీని పొడిగిస్తే వీక్షణలు పెరగడంతో పాటు ప్రకటనల ధర కూడా అధికంగా ఉంటుందని స్టార్ ఇండియా భావిస్తోంది.

క్రికెటర్లకి క్యాంప్:
ఒకవేళ నవంబరు 15 వరకూ ఐపీఎల్ 2020 జరిగితే.. డిసెంబరు 3న ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న నాలుగు టెస్టుల సిరీస్‌కి సిద్ధమయ్యేందుకు భారత ఆటగాళ్లకు చాలా తక్కువ సమయం ఉంటుంది. యూఏఈ వేదికగా ఐపీఎల్‌కి కేంద్ర ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వగానే.. క్రికెటర్లకి అక్కడ ఓ క్యాంప్‌ని ఏర్పాటు చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఏదేమైనా వచ్చే వారం ఐపీఎల్ పాలక మండలి సమావేశం జరుగనుంది. ఐపీఎల్ 2020 తుది షెడ్యూల్, వేదిక తదితర అంశాలపై ఆ సమావేశం తర్వాత స్పష్టత రానుంది.

యూఏఈలో ఐపీఎల్-7:
ఐపీఎల్ 2020 లీగ్‌ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారన్న వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దుబాయ్ స్పోర్ట్స్ సిటీ చీఫ్ సల్మాన్ హనీఫ్ స్పందించాడు. 'ఐపీఎల్ 2020ని దుబాయ్‌లో నిర్వహించాలనుకుంటే.. మేము సిద్ధంగా ఉన్నాం. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో అన్ని సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ఐసీసీ అకాడమీ.. స్పోర్ట్స్ సిటీలోనే ఉన్నాయి. స్టేడియంలో తొమ్మిది పిచ్‌లు ఉన్నాయి. ఒకవేళ తక్కువ సమయంలో ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించినా ఎటువంటి నష్టం ఉండదు' అని అన్నారు. ఒక్క ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతే దాదాపు 4వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2014లో తొలిసారి యూఏఈలో 2014లో ఐపీఎల్-7ను నిర్వహించిన విషయం తెలిసిందే.
వీడ్కోలు ఇంకాస్త బాగుండాల్సింది.. అయినా ఫర్వాలేదు: భారత దిగ్గజం


Click it and Unblock the Notifications
