
షార్జా: టీ20 క్రికెట్ ఫార్మట్‌లో యూనివర్సెల్ బాస్ క్రిస్ గేల్ మరో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ ఫార్మట్‌లో ఇప్పటికే 10 వేల పరుగుల ల్యాండ్‌మార్క్‌ను అందుకున్న ఈ వెస్టిండీస్ వీరుడు ఫోర్లు, సిక్సుల ద్వారా అత్యధిక రన్స్ సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. టీ20 ఫార్మట్‌లో ఫోర్లు, సిక్సుల ద్వారా మాత్రమే రెండువేలకు పైగా పరుగులను చేశాడు. గురువారం రాత్రి షార్జాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతను ఈ ఘనతను అందుకున్నాడు.
ఫోర్లు, సిక్సుల ద్వారా 2,010 పరుగులు చేశాడు. అతని కంటే ముందు కీరన్ పొలార్డ్ ఈ లిస్ట్‌లో ఉన్నాడు. ఈ ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లో అయిదు సిక్సులు ఒక ఫోర్‌తో 53 పరుగులు చేశాడు. దీనితో కేవలం సిక్సుల ద్వారా 983 పరుగులు, ఫోర్ల ద్వారా 1027 రన్స్ సాధించాడు.
ఐపీఎల్ సహా బిగ్‌బాష్, ఛాంపియన్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి టీ20 ఫార్మట్ మ్యాచ్‌లల్లో క్రిస్ గేల్ ఆడుతున్నాడు. 54 ఐసీసీ టీ20 మ్యాచుల్లో ఆడాడు. అక్కడతను పెద్దగా రాణించట్లేదు. ఈ 54 మ్యాచుల్లో కలిపి గేల్ చేసినవి 1627 పరుగులే. బ్యాటింగ్ సగటు 32.5 శాతంగా నమోదైంది. 142.8 స్ట్రైక్ రేట్ ఉంది. ఇందులో 13 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ వంటి టోర్నమెంట్లలో చెలరేగిపోతున్నాడు. క్రిస్ గేల్ కంటే కీరన్ పొలార్డ్ ఈ జాబితాలో ఉన్నాడు.
2009 నుంచీ క్రిస్ గేల్ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఇప్పటిదాకా 126 మ్యాచ్‌లల్లో పార్టిసిపేట్ చేశాడు. 4537 పరుగులు చేశాడు. 15 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.ఐపీఎల్‌లో క్రిస్ గేల్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగులు. బ్యాటింగ్ యావరేజ్ 41.24గా నమోదైంది. 150.53 స్ట్రైక్ రేట్ రికార్డైంది. ఈ సారి కూడా తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీతో అదరగొట్టాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌లో లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్‌గా జట్టును గెలిపించే ఇన్నింగ్ ఆడాడు. మరిన్ని మ్యాచ్‌లు ముందున్నందున.. అతని బ్యాట్ నుంచి మెరుపులు జాలవారడం ఖాయంగా కనిపిస్తోంది.