For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

24 బంతుల్లో 14: ధోనీ సేన వైఫల్యానికి ఇంతకంటే సాక్ష్యం అవసరమా?:

IPL 2020: Chennai Super Kings scored only 14 runs in 11-15 overs

అబుధాబి: ఐపీఎల్-2020 సీజన్‌లో మ్యాచులు నడుస్తున్న కొద్దీ.. చెన్నై సూపర్ కింగ్స్ తేలిపోతోంది. ఆ జట్టు వైఫల్యాలు మూకుమ్మడిగా బయటపడుతున్నాయి. టైటిల్ హాట్ ఫేవరెట్లలో ఒకటిగా సీజన్ ఆరంభానికి ముందు పేరు తెచ్చుకున్న చెన్నై కింగ్స..క్రమంగా ఆడలేక చేతులెత్తేస్తోంది.. ప్రత్యర్థుల ఎదురుదాడికి కుదేల్ అవుతోంది. చెన్నై లయన్స్ కాస్తా.. పేపర్ లయన్స్‌గా రూపాంతరం చెందుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన ఆరు మ్యాచుల్లో రెండింట్లో మాత్రమే విజయాన్ని నమోదు చేసింది ధోనీ సేన. పంజాబ్‌పై అరివీర భయంకరంగా చెలరేగిన చెన్నై.. గాడిలో పడినట్టు కనిపించినప్పటికీ.. అది ఆ మ్యాచ్‌కే పరిమితమైంది.

బ్యాట్స్‌మెన్ల వైఫల్యం..

బ్యాట్స్‌మెన్ల వైఫల్యం..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో బుధవారం రాత్రి కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. దినేష్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కత టీమ్ తమ ముందు ఉంచిన 168 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో అయిదు వికెట్లను కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. 10 రన్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్ షేన్ వాట్సన్, చివరిలో రవీంద్ర జడేజా తప్ప బ్యాటింగ్‌లో ఎవరూ రాణించలేకపోెయారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు.. మిడిల్ ఓవర్లు దారుణంగా దెబ్బకొట్టాయా జట్టును.

గెలవాలనే కసి లేకుండా..

గెలవాలనే కసి లేకుండా..

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ల వైఫల్యానికి అద్దం పట్టాయి మిడిల్ ఓవర్లు. మిడిల ఓవర్లలో టెస్ట్ మ్యాచ్‌ను తలపించేలా బ్యాటింగ్ సాగింది. తాము ఆడుతోంది ఐపీఎల్ అనే విషయాన్ని విస్మరించినట్లు కనిపించారు బ్యాట్స్‌మెన్లు. ఐపీఎల్‌లో గానీ, టీ20 ఫార్మట్‌లో గానీ ఓవర్‌కు కనీసం 8 నుంచి 10 పరుగులు చేయడం సర్వ సాధారణం. ఆ మాత్రం పరుగులు చేయకపోతే.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడం అసాధ్యం.. దాన్ని ఛేదించడమూ అంతే దుర్లభం. అలాంటి ఫార్మట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లు బద్ధకంగా ఆడారు. గెలవాలనే కసి ఏ మాత్రం కనిపించలేదు వారిలో.

11-14 ఓవర్లలో 14 పరుగులే..

11-14 ఓవర్లలో 14 పరుగులే..

కీలకమైన మిడిల్ ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన స్కోరు కేవలం 14 పరుగులు మాత్రమే. 11వ ఓవర్ నుంచి 15వ ఓవర్ వరకు వారి బ్యాటింగ్ నత్త నడకన సాగింది. చూసేవారికి బోరు కొట్టించింది. 10వ ఓవర్‌లో 12 పరుగులు రాబట్టుకున్న తరువాత.. మళ్లీ ఆ స్థాయిలో రన్లు వచ్చింది 16వ ఓవర్‌లోనే. 10వ ఓవర్‌లో షేన్ వాట్సన్ రెండు ఫోర్లు కొట్టాడు. మళ్లీ ఫోర్లు, సిక్సర్లు నమోదైంది అయిదు ఓవర్ల తరువాతే. 16వ ఓవర్‌లో వరుసగా ఓ సిక్సర్, ఓ ఫోర్ పడేంత వరకూ చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు బోర్డు నత్త కంటే నిదానంగా నడకను సాగించింది.

 ఏ ఓవర్‌లో ఎన్ని పరుగులంటే..

ఏ ఓవర్‌లో ఎన్ని పరుగులంటే..

11వ ఓవర్‌లో ధోనీ సేన పతనం ఆరంభమైనట్టు కనిపించింది. పాట్ కమ్మిన్స్ వేసిన ఆ ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. పైగా అందులో ఒకటి వైడ్. సునీల్ నరైన్ వేసిన 12వ ఓవర్‌లోనూ పెద్దగా మార్పు రాలేదు. ఆ ఓవర్‌లో అయిదు పరుగులను మాత్రమే రాబట్టుకున్నారు షేన్ వాట్సన్, అంబటి రాయుడు. ఈ ఓవర్ ముగిసే సరికి చెన్నైకి 48 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కమలేష్ నగర్కోటి వేసిన 13వ ఓవర్ తొలి బంతికి అంబటి రాయుడు అవుట్ అయ్యాడు. ఆ ఓవర్‌లో వచ్చింది రెండంటే రెండు పరుగులే. 14వ ఓవర్‌ మరింత దెబ్బకొట్టింది. నరైన్ వేసిన ఈ ఓవర్‌లో తొలి బంతికి వాట్సన్ అవుట్ అయ్యాడు. మూడు పరుగులే వచ్చాయి. ఈ నాలుగు ఓవర్లలో చెన్నై సాధించింది 14 రన్లు మాత్రమే. 15వ ఓవర్‌లో ఆరు పరుగులు రాబట్టారు.

Story first published: Thursday, October 8, 2020, 9:02 [IST]
Other articles published on Oct 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+