Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీకల్దాకా మునిగిన కేదార్ జాదవ్: తొలగించాంటూ ఫ్యాన్స్ పిటీషన్: వేలమందితో సంతకాలు

IPL 2020: Chennai Super Kings fans creating petitions to drop Kedar Jadhav from the team

చెన్నై: ఐపీఎల్-2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలను మూటగట్టుకుంటోంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై సాధించిన ఘన విజయం మినహా.. ఇప్పటిదాకా ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విఫలమౌతూనే వస్తోంది. మిడిలార్డర్‌లో అంబటి రాయుడు రాణించడంతో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిందే తప్ప.. జట్టులో టీమ్ వర్క్ అనేది లోపించింది. ఆ జట్టు చవి చూస్తోన్న వరుస పరాజయాలు దీనికి అద్దం పడుతున్నాయి. టైటిల్ హాట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన చెన్నై టీమ్.. మ్యాచ్‌లు గడుస్తున్న కొద్దీ విజయాల కోసం ఆపసోపాలు పడుతోంది.

నిర్లక్ష్యానికి మూల్యం..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో బుధవారం రాత్రి కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. గెలవడానికి అవకాశం ఉన్న మ్యాచ్‌ను నిర్లక్ష్యం వల్ల ప్రత్యర్థికి ధారదాత్తం చేయాల్సి వచ్చింది. చివరి మూడు ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన దశలో చేతులు ఎత్తేసింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ క్రీజులో ఉన్నప్పటికీ.. లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 10 పరుగుల దూరంలో ఆగిపోయింది. జడేజా ధాటిగా ఆడినప్పటికీ.. కేదార్ మాత్రం ఆ పని చేయలేదు. నింపాదిగా ఆడాడు. ఆ వైఖరే అతనిపై నిప్పులు చెరిగేలా చేస్తోంది.

డ్రాప్ కేదార్ జాదవ్

కేదార్ జాదవ్‌ను జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అతనిపై నిప్పులు చెరుగుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. అతని గుట్టు మొత్తాన్నీ సోషల్ మీడియా ద్వారా రట్టు చేస్తున్నారు. అక్కడితో ఆగట్లేదు. చెన్నై స్క్వాడ్ నుంచి కేదార్ జాదవ్‌ను తొలగించాలంటూ పిటీషన్లూ వేశారు. ఆన్‌లైన్ ద్వారా సంతకాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే 12,230 మందికి మందికి పైగా ఈ పిటీషన్‌పై సంతకాలు చేశారు. 15 వేల సంతకాలను సేకరించేలా ఆన్‌లైన్ పిటీషన్లు దాఖలు చేశారు.

ధోనీకి డిమాండ్..

ఈ పిటీషన్లు చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీని అడ్రస్ చేస్తున్నాయి. తదుపరి మ్యాచ్‌లో అతణ్ని తుది జట్టులోకి తీసుకోవద్దంటూ సీఎస్‌కే ఫ్యాన్స్ కోరుతున్నారు. తాము ఈ పిటీషన్‌ను ఎందుకు దాఖలు చేస్తున్నామనడానికి కారణాలను కూడా వివరిస్తున్నారు. కోల్‌కతపై మ్యాచ్ ఓడిపోవడానికి అతనే ప్రధాన కారణమనీ ఆరోపిస్తున్నారు. కేదార్ జాదవ్ స్థానంలో మరో యంగ్ క్రికెటర్‌ను ఆడించాలని, సామ్ కుర్రమ్ తరహాలో ఆల్ రౌండర్‌ను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మ్యాచ్‌ను గెలిపించాలనే తపన కుర్రమ్‌లో కనిపిస్తోందని, అలాంటి ఫైర్ కేదార్ జాదవ్‌లో లేదనీ అంటున్నారు.

Story first published: Thursday, October 8, 2020, 11:47 [IST]
Other articles published on Oct 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+