Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై సింహాలకు ఏమైంది?: పాయింట్ల పట్టికలో ఫస్ట్..లాస్ట్ నుంచి: ధోనీ..ఏ మాయ చేస్తాడో?

IPL 2020: Chennai Super Kings drops to 8th on points table, fans troll

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్.. ఈ టీమ్‌తో తలపడాల్సి వస్తోందంటే.. ప్రత్యర్థి జట్టు ఒళ్లు దగ్గర పెట్టుకుంటుంది. ధోనీ సేనతో పోరాడాల్సి వస్తోందంటే.. ఒకటిికి రెండుసార్లు జట్టు కూర్పు గురించి ఆలోచిస్తుంది. తెగించి పోరాడితే తప్ప చెన్నై సింహాలపై విజయం సాధించలేమనే అభిప్రాయం ప్రత్యర్థి జట్లలో బలంగా నాటుకునిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచుల్లో ఇప్పటిదాకా సీఎస్‌కే సాధించిన విజయాలు గాలివాటం కానే కాదు. ప్రత్యర్థిని మట్టి కరిపించి మరీ ఘన విజయాలను అందుకుంటూ వచ్చింది. మొత్తం మూడుసార్లు టైటిళ్లను ఎగరేసుకెళ్లింది ధోనీ టీమ్.

దయనీయ స్థితిలో..

దయనీయ స్థితిలో..

అలాంటి పటిష్టమైన, బలమైన జట్టు.. ఈ సారి దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ జట్టు ఎలాంటి దుస్థితిలో పడిందంటే.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లను ఆడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయాన్ని అందుకుంది. మిగిలిన రెండింట్లో దారుణ పరాజయాన్ని చవి చూసింది. వరుసగా రెండు మ్యాచ్‌లను ప్రత్యర్థికి జట్టుకు ధారదాత్తం చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఓ మెట్టు పైనే ఉంది.

సన్ రైజర్స్ కంటే దిగువకే..

సన్ రైజర్స్ కంటే దిగువకే..

ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గిన జట్లల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కటేకాదు..కేఎల్ రాహుల్ సారథ్యంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రోహిత్ శర్మ నాయకత్వాన్ని వహిస్తోన్న ముంబై ఇండియన్స్, డేవిడ్ వార్నర్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్.. సైతం రెండు చొప్పున మ్యాచ్‌లను ప్రత్యర్థికి కోల్పోయాయి. అయినప్పటికీ.. నెట్ రన్‌రేట్ ఆయా టీమ్‌ల కంటే దారుణంగా చెన్నైది. చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్‌రేట్ -0.840గా నమోదైంది. పాయింట్ల టేబుల్‌లో ఎనిమిదో స్థానానికి దిగజారింది. సన్ రైజర్స్ టీమ్ నెట్ రన్‌రేట్ -0.228తో ధోనీ సేన కంటే మెరుగ్గా ఉంది. మైనస్ నెట్ రన్‌రేట్‌తో ఉన్నవి ఈ రెండు జట్లే.

శుక్రవారమే పోరు..

శుక్రవారమే పోరు..

పాయింట్ల పట్టికలో అట్టుడుగు స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ జరగబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. అటు ధోనీ సేన, ఇటు వార్నర్ టీమ్‌లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఏ జట్టు ఓడిపోయినా.. టోర్నమెంట్‌లో ముందడుగు వేసే అవకాశాలకు దూరమైనట్టే. ప్రతి మ్యాచ్‌నూ గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటాయి.

ధోనీ.. ఏ మాయ చేస్తాడో..

ధోనీ.. ఏ మాయ చేస్తాడో..

తాము ప్రాణసమానంగా అభిమానించే జట్టు ఇలాంటి పరిస్థితులకు చేరుకుంటుందని టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఏ ఒక్క చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ కూడా భావించి ఉండకపోవచ్చు. గెలిచి తీరాల్సిన స్థితిలో పడిపోతుందని ఊహించి ఉండరు. ఈ పరిణామాల మధ్య శుక్రవారం జరగబోయే మ్యాచ్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ధోనీ ఏ మాయ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌తో పోల్చుకుంటే చెన్నై టీమ్ అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. చివరి రెండు మ్యాచ్‌లను ఓడిపోయి, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. అదే సమయంలో బలమైన ఢిల్లీ కేపిటల్స్‌ను ఓడించి, రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగడానికి సై అంటోంది వార్నర్ సేన.

Story first published: Thursday, October 1, 2020, 11:37 [IST]
Other articles published on Oct 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+