
బయో బబుల్ రచ్చ..
ఈ పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ పేస్ బౌలర్ కేఎం ఆసిఫ్.. సరికొత్త వివాదాలను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి బయో-సెక్యూర్ బబుల్ నిబంధనలను ఉల్లంఘించాడంటూ వార్తలు వెలువడ్డాయి. బయో సెక్యూర్ బబుల్ నిబంధనలను ఉల్లంఘించిన క్రికెటర్.. ఆరురోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. అసలే ఓటములతో సతమతమౌతోన్న టీమ్.. ఓ బౌలర్‌ను కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంచాల్సి వస్తుందని, దాని ప్రభావం జట్టులోని మిగిలిన ఆటగాళ్ల మానసిక స్థితిపైనా పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

తాళం చెవి పోగొట్టుకోవడంతో.. అసలు కారణం అదే
కేఎం ఆసిఫ్.. జట్టు బస చేసిన హోటల్‌లో తనకు కేటాయించిన గది తాళం చెవులను పోగొట్టుకోవడం..ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. తాళం చెవిని పోగొట్టుకోవడం వల్ల కేఎం ఆసిఫ్.. రిసెప్షన్ డెస్క్ వద్దకు వెళ్లి.. డూప్లికేట్ కీని తీసుకున్నాడు. అలా రిసెప్షన్ డెస్క్ వద్దకు వెళ్లడం.. హోటల్ గది తాళం చెవిని తీసుకోవడం.. బయో సెక్యూర్ బబుల్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తున్నారు. ఆ రిసెప్షన్ డెస్క్.. బయో సెక్యూర్ బబుల్ పరిధిలో లేదంటూ ఓ ఇంగ్లీష్ దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం దాని మీదే చర్చ నడుస్తోంది.

సీఎస్‌కే సీఈఓ ఏం చెబుతున్నారు?
ఇలా- బయో సెక్యూర్ బబుల్ నిబంధనలను ఉల్లంఘించిన తొలి క్రికెటర్‌గా కేఎం ఆసిఫ్ గుర్తింపు పొందారు. ఈ వివాదం నడుస్తుండగానే చెన్నై సూపర్ కింగ్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కాశీ విశ్వనాథన్ వివరణ ఇచ్చారు. కేఎం ఆసిఫ్ వివాదానికి తెర దించారు. అతను బయో సెక్యూర్ బబుల్ నిబంధనలను బ్రేక్ చేయలేదని అన్నారు. కేఎం ఆసిఫ్ తాళం చెవి పోగొట్టుకున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. డూప్లికేట్ కీని డిజిగ్నేటెడ్ డెస్క్ వద్ద నుంచే తీసుకున్నాడని చెప్పారు.

బయో బబుల్ పరిధిలో..
ఐపీఎల్ క్రికెటర్ల కోసమే ప్రత్యేకంగా హోటల్ డెస్క్, స్టాఫ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నామని కాశీ విశ్వనాథన్ తెలిపారు. అలా తాము డిజిగ్నేట్ చేసిన డెస్క్ వద్ద నుంచే కీని తీసుకున్నాడని, ఇందులో బయో బబుల్ నిబంధనల ఉల్లంఘన జరగలేదనీ అన్నారు. బయో సెక్యూర్ బబుల్ పరిధిలో లేని హోటల్ సిబ్బంది లేదా రిసెప్షన్ డెస్క్ వద్దకు కేఎం ఆసిఫ్ వెళ్లలేదని చెప్పారు. అతనికి ఆరు రోజుల క్వారంటైన్ అవసరం ఉండబోదని కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. కేఎం ఆసిఫ్ కూడా ఇదేరకమైన వివరణ ఇచ్చాడు. తాను డిజిగ్నేటెడ్ డెస్క వద్దకే వెళ్లినట్లు పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












