క్రికెట్ ఆడటమంటే..ప్రభుత్వ ఉద్యోగం అనుకున్నారా?: అతను యూజ్‌లెస్ డెకరేషన్‌: ధోనీసేనపై బ్లాస్ట్

IPL 2020 : Cricket Not Like A Government Job | KKR vs CSK || Oneindia Telugu

న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో కొనసాగిస్తోన్న పరాజయాల పరంపర.. చెన్నై సూపర్ కింగ్స్‌కు నిద్ర పట్టనివ్వట్లేదు. వరుసగా పలకరిస్తోన్న పరాజయాలు నీడలా వెంటాడుతున్నాయి. నిద్రలో కూడా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కోల్‌కత నైట్ రైడర్స్‌పై గెలిచే మ్యాచ్‌ను చేతులారా పోగొట్టుకున్న అనంతరం ఆరంభమైన విమర్శల జడివాన.. ఇంకా కొనసాగుతూనే ఉంది. పరువు నిలుపుకోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితిని చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కొంటోంది.

అభిమానులే కాదు..

అభిమానులే కాదు..

అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. హేమాహేమీల్లాంటి బ్యాట్స్‌మెన్లు, బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. కోల్‌కత నైట్ రైడర్స్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. 157 పరుగులకే చతికిల పడింది. ఇప్పటిదాకా చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన మ్యాచ్‌లు ఒక ఎత్తయితే.. ఇదొక ఎత్తగా మారింది. గెలవదగ్గ మ్యాచ్‌ను చేతులారా పోగొట్టుకుందనే ఆవేదన, ఆగ్రహం అభిమానులనే కాదు.. టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్లలోనూ కనిపిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటున్నారా?

ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటున్నారా?

తాజాగా- వీరేంద్ర సెహ్వాగ్.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ధోనీ సేనలోని కొందరి క్రికెటర్ల ఆట తీరు పట్ల తూటాల్లాంటి విమర్శలను సంధించాడు. క్రికెట్ ఆడటం అంటే ప్రభుత్వ ఉద్యోగంలా భావిస్తున్నారని మండిపడ్డాడు. ఇలాంటి దుస్థితిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎప్పుడూ లేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో ఆడినా, ఆడకపోయినా తన డబ్బులు తనకు వస్తున్నాయనే భావనలో కొందరు క్రికెటర్లు ఉన్నారని, దీన్ని నుంచి వీలైనంత త్వరగా బయటికి రావాలని సూచించాడు.

కేదార్ జాదవ్‌లో సమయస్ఫూర్తి

కేదార్ జాదవ్‌లో సమయస్ఫూర్తి

పనిలోపనిగా వీరేంద్ర సెహ్వాగ్.. మిడిల్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్‌నూ తప్పుపట్టారు. గెలవడానికి అవకాశం ఉన్న మ్యాచ్‌లో అతను ఏ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదని పేర్కొన్నాడు. కాస్త ధాటిగా ఆడితే.. విజయం ఖాయమనే పరిస్థితుల్లో అతను నింపాదిగా ఆడటం పట్ల సరికాదని అన్నాడు. 12 బంతుల్లో ఏడు పరుగులు చేయడం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ పని కాదని అన్నాడు. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు దిగే క్రికెటర్.. సమయస్ఫూర్తిని ప్రదర్శించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇది కేదార్ జాదవ్‌లో కొరవడిందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

యూజ్‌లెస్ డెకరేషన్

యూజ్‌లెస్ డెకరేషన్

సులువుగా ఛేజ్ చేయదగ్గ స్కోర్‌ను ముందు ఉంచుకుని.. కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా డాట్ బాల్స్ ఆడటం జట్టుకు ఏ రకంగానూ మేలు చేయలేదని అన్నాడు. సెహ్వాగ్ సొంతంగా నిర్వహిస్తోన్న వీరూ కి బైఠక్‌ ప్రోగ్రామ్‌లో కేదార్ జాదవ్ బ్యాటింగ్ శైలిపై సెటైర్లు వేశాడు. కేదార్ జాదవ్ ఓ యూజ్‌లెస్ డెకరేషన్‌గా తయారయ్యాడని చురకలు అంటించారు. రియల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కేదార్ జాదవ్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య చెన్నై సూపర్ కింగ్స్ .. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతోంది. పరువు నిలుపుకోవాలంటే చెన్నై టీమ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, October 9, 2020, 9:22 [IST]
Other articles published on Oct 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X