Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ అధికారిక ప్రకటన.. 2020 ఐపీఎల్ షెడ్యూల్ విడుదల!!

IPL 2020: BCCI has announced the full schedule and fixtures for the league stage

ముంబై: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ (ఐపీఎల్) సీజన్-13కు సంబంధించిన లీగ్ దశ షెడ్యూల్‌ విడుదల అయింది. బీసీసీఐ కార్య‌ద‌ర్శి 'జై షా' అధికారిక షెడ్యూల్‌ను ప్ర‌క‌టించారు. మార్చి 29వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో తొలి మ్యాచ్ జ‌రుగుతుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియ‌న్స్ తొలి మ్యాచ్ ఆడుతుంది. మే 24వ తేదీన ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది.

బీసీసీఐ అధికారిక ప్రకటన

బీసీసీఐ అధికారిక ప్రకటన

ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించక ముందే సంబంధిత ఫ్రాంచైజీలు ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ అధికారిగా షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29 నుంచి మే 17 వ‌ర‌కు లీగ్ ద‌శ ఉండగా.. నాకౌట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను త‌ర్వాత ప్ర‌క‌టించ‌నున్నారు. చివరి లీగ్‌ మ్యాచ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ మధ్య జరగనుంది.

రాజస్థాన్‌ మాత్రమే

రాజస్థాన్‌ మాత్రమే

లీగ్ ద‌శలో మొత్తం ఎనిమిది జట్లు ఏడు హోమ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మిగతా ఏడు మ్యాచ్‌లు బయట ఆడతాయి. అయితే ఏప్రిల్ 5, 9 తేదీల్లో రాజస్థాన్ రాయల్స్ ఆడే రెండు మ్యాచ్‌లు జైపూర్ లేదా గౌహతిలో ఆడే అవకాశం ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల వేదికలు త్వరలోనే విడుదల చేయనున్నారు. ఫ్రాంచైజీలు అన్ని తమ సొంత మైదానాల్లోనే మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఒక్క రాజస్థాన్‌ మాత్రమే జైపూర్‌ తర్వాత గువహటిని తమ రెండో హోం గ్రౌండ్‌గా ఎంపిక చేసుకుంది.

ఆదివారాల్లో మాత్రమే

ఆదివారాల్లో మాత్రమే

సీజ‌న్‌-13లో కేవ‌లం ఆరు మ్యాచ్‌లు మాత్ర‌మే మ‌ధ్యాహ్నం జ‌ర‌గ‌నున్నాయి. రాబోయే సీజన్‌లో ఏ ఒక్క శనివారం కూడా రెండు మ్యాచ్‌లు నిర్వహించట్లేదు. ఇకపై కేవలం ఆదివారాల్లో మాత్రమే రెండు (4PM, 8PM) మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. లీగ్ తొలి రోజు, చివరి రోజు మినహాయించి మిగిలిన ఆదివారాల్లో మాత్రమే ఈ డబుల్‌ హెడర్‌‌లు జరుగుతాయి. లీగ్‌ దశ ఏకంగా ఆరు వారాల పాటు కొనసాగనుంది. ఇక మొత్తం 57 రోజుల పాటు ఐపీఎల్ టోర్నీ ఉంటుంది.

ఉప్పల్‌‌లో ఏడు మ్యాచ్‌లు

ఐసీసీ ఉన్నత స్థాయి సమావేశం, విదేశీ ఆటగాళ్ల రాక ఆలస్యమవుతుందనే కారణంతో ఐపీఎల్ ప్రారంభ తేదీని మార్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు ఉహాగానాలు వినిపించగా.. అన్నింటికీ జైషా చెక్ పెట్టారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తమ ‘హోం' మ్యాచ్‌లను ఎప్పటిలాగే ఉప్పల్‌‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనుండగా.. ఈ ఏడు మ్యాచ్‌లు ఏప్రిల్‌ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరుగుతాయి. ఇతర వేదికల్లో ఏప్రిల్‌ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్‌రైజర్స్‌ తమ మ్యాచ్‌లు ఆడనుంది.

Story first published: Tuesday, February 18, 2020, 15:52 [IST]
Other articles published on Feb 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+