Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా సన్నాహాలు: గాయపడ్డ క్రికెటర్ల వివరాలు కోరిన బీసీసీఐ

IPL 2020: BCCI asks Franchises to Inform about details of Injured Contracted Cricketers

ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే..ఇక భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత టీమిండియా ఓ విదేశీ పర్యటన కోసం బయలుదేరి వెళ్లబోతుండటం ఇదే తొలిసారి. అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనడం కూడా ఇదే తొలిసారి అవుతుంది. ఇదివరకు దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చిన్పటికీ.. అప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో.. ఆ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది.

ఐపీఎల్ హడావుడి ముగిసిన వెంటనే..

ఐపీఎల్ హడావుడి ముగిసిన వెంటనే..

ఇక- ఆస్ట్రేలియా పర్యటన తెరమీదికి వచ్చింది. ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు.. నాలుగు టెస్ట్ మ్యాచ్‌లను ఆడబోతోంది. మూడు వన్డే ఇంటర్నేషనల్స్, మరో మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. దీనికోసం మరి కొన్ని గంటల్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. టీమిండియా జట్టు వివరాలను వెల్లడించబోతోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఐపీఎల్ మెగా టోర్నమెంట్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. వచ్చేనెల 10వ తేదీన ఐపీఎల్ ముగుస్తుంది. అదేనెల చివరివారంలో ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ ఉండొచ్చని తెలుస్తోంది.

కాంట్రాక్టెడ్ క్రికెటర్ల పరిస్థితేంటీ?

కాంట్రాక్టెడ్ క్రికెటర్ల పరిస్థితేంటీ?

ఐపీఎల్-2020 టోర్నమెంట్ సందర్భంగా పలువురు బీసీసీఐ కాంట్రాక్టెడ్ క్రికెటర్లు గాయపడ్డ విషయం తెలిసిందే. వారి వివరాలను వెంటనే అందజేయాలని బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు సూచించింది. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కొనసాగుతోన్న కొందరు క్రికెటర్లు ఐపీఎల్ టోర్నమెంట్ సందర్భంగా గాయపడ్డారు. వారి గాయాల పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది? గాయాల తీవ్రత ఎలా ఉంది? అనే పూర్తి సమాచారంతో కూడిన నివేదికను అందజేయాలని బీసీసీఐ సూచించింది. టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ సారథ్యంలోని టీమ్.. ఈ వివరాలను సేకరిస్తోంది.

పేసర్లు లేకుండానే..

పేసర్లు లేకుండానే..

ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అందించే ఈ నివేదిక ఆధారంగా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లే టీమిండియా జట్టును ఖరారు చేసే అవకాశం ఉంది. టెస్ట్ క్రికెటర్, పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే గాయపడ్డారు. వారందరూ ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీకి చెందిన క్రికెటర్లు. ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా.. ఇప్పటికే ఐపీఎల్ టోర్నమెంట్‌ మొత్తానికీ దూరం అయ్యారు. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్.. ఢిల్లీ కేపిటల్స్ ఆడబోయే తరువాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అదే జట్టుకు ఆడుతోన్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా గాయాలపాలైనప్పటికీ.. ఆ తరువాత కోలుకున్నాడు.

కొత్త ముఖాలకు ఛాన్స్?

కొత్త ముఖాలకు ఛాన్స్?

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతోన్న భువనేశ్వర కుమార్ కూడా గాయపడ్డాడు. అతని గాయం తీవ్రమైనదే. అందుకే ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి రూల్ అవుట్ అయ్యాడు. ఇద్దరు పేస్ బౌలర్లు గాయపడటం.. ఆందోళన కలిగించేదే. ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లే టీమిండియా జట్టులో వారికి చోటు దక్కకపోవచ్చు. టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తోన్న ఇషాంత్ శర్మ.. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం ఆరువారాల సమయం పట్టొచ్చని తెలుస్తోంది. ఇదే పరిస్థితిని భువనేశ్వర్ కుమార్ కూడా ఎదుర్కొంటున్నాడు. ఈ పరిస్థితుల మధ్య కొత్త ముఖాలకు అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది.

Story first published: Friday, October 16, 2020, 14:58 [IST]
Other articles published on Oct 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+