For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ఎప్పుడో తెలుసా?

IPL 2020 Auction Set To Be Held In December
IPL 2020: Auctions for Indian Premier League 13 Likely to be Held in December 2019

హైదరాబాద్: ఐపీఎల్ 2020 కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే అనేక జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని జట్లు తమ స్క్వాడ్లలో అనేక మార్పులు చేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది జులైలో ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్‌ల మధ్య బదిలీ ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందంలో భాగంగా ముంబై ఇండియన్స్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇచ్చి, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌ని ముంబై జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 2018న ఐపీఎల్ వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, రాబోయే సీజన్ కోసం మినీ ఐపీఎల్ వేలాన్ని నిర్వహించనున్నారు.

చాలా మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు తమ వద్దే ఉంచుకోనున్నాయి. అయితే, ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న మినీ వేలంలో ఫ్రాంచైజీలు అదనంగా మూడు కోట్ల రూపాయాలను ఆటగాళ్ల కొనుగోలు కోసం వెచ్చించేందుకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అవకాశం కల్పించనుంది. దీని ప్రకారం ఫ్రాంచైజీలు రూ. 86 కోట్ల వరకు ఆటగాళ్ల కోనుగోలు కోసం వెచ్చించనున్నాయి.

అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఫ్రాంఛైజీలు సైతం పనితీరు సరిగాలేని ఆటగాళ్ళ జాబితాను ఇంకా విడుదల చేయలేదు. గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన చేస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లాంటి ఫ్రాంచైజీలు తమ జట్లను పునరుద్ధరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు రాబోయే సీజన్ కోసం ఇప్పటికే పలు మార్పాలు చేశాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి జట్లు మాత్రం ప్రస్తుతం ఉన్న స్క్వాడ్‌తో సంతృప్తిగానే ఉన్నాయి. అయితే, వేలంపై నిర్వాహాకులు అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూద్దాం...

ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సరైన స్పిన్నర్ లేని కారణంగా ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. మయాంక్ మార్కండేతో స్పిన్నర్ లేని లోటు తీరడంతో పాటు ఢిల్లీ బౌలింగ్ లైనప్ మరింత పటిష్టం కానుంది. ఇప్పటికే ఆ జట్టులో కగిసో రబాడ, ఇషాంత్ శర్మ వంటి క్వాలిటీ పేసర్లు ఉన్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, September 26, 2019, 17:14 [IST]
Other articles published on Sep 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+