Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020 Auction Live Streaming: ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి?

IPL 2020 Auction Full Details, When & Where To Watch ! || Oneindia Telugu
IPL 2020 Auction Live Streaming: When and where to watch Live Telecast

హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం వేలం డిసెంబర్ 19(గురువారం) కోల్‌కతాలో ప్రారంభం కానుంది. వేలానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్వాహాకులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ వేలానికి 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా 332 మంది(186 భారతీయులు, 146 విదేశీయులు) ఎంపికయ్యారు.

వీరికి సంబంధించిన జాబితాలను బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు అందజేసింది. దీంతో ఈ వేలంలో పాల్గొనే మొత్తం ఎనిమిది ప్రాంచైజీలు 73 మందిని ఎంపిక చేసుకోనున్నారు. ఇందులో 29 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉంది. దేశవాళీల్లో సత్తాచాటుతున్న యువ ఆటగాళ్లను గుర్తించేందుకు వేలానికి ముందే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహించారు.

దీంతో వచ్చే సీజన్ కోసం జరగనున్న ఐపీఎల్ వేలంలో ఫ్రాంఛైజీలు యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపే అవకాశముంది. జట్టును కొత్త వారితో నింపడం ద్వారా మరింత మెరుగైన ఆటతీరు కనబర్చాలని భావిస్తున్నాయి. దీంతో ఈసారి వేలంలో పలువురు విదేశీ క్రికెటర్లు భారీ ధర పలికే అవకాశం ఉంది.

ఈ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం అత్యధికంగా రూ. 42.70 కోట్లను ఖర్చు చేసే అవకాశం ఉండగా... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యల్పంగా రూ. 27.90 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ విదేశీ ఆటగాళ్ళపై ఎక్కువగా దృష్టి పెడుతుంది.

ఐపీఎల్ వేలం 2020 గురించి ప్రత్యేకమైన విషయాలు మీకోసం:

ఐపీఎల్ 2020 వేలం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
డిసెంబర్ 19 గురువారం మధ్యాహ్నం 2:30 నుండి

ఐపిఎల్ 2020 వేలాన్ని ఎక్కడ ప్రత్యక్షంగా చూడాలి?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో

ఐపిఎల్ 2020 వేలాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి?
హాట్‌స్టార్

ఐపీఎల్ 2020 వేలం ఎక్కడ జరుగుతుంది?
మొదటిసారి కోల్‌కతాలో ఈ వేలాన్ని జరగనుంది.

Story first published: Wednesday, December 18, 2019, 15:15 [IST]
Other articles published on Dec 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+