ముగిసిన ఐపీఎల్ 2020 వేలం: అండర్-19 ఆటగాళ్లకు కోట్లు, అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే!

IPL 2020 Auction Live Streaming: Franchises are ready to take part in Kolkata

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్ కోసం గురువారం కోల్‌కతాలో ఐపీఎల్ వేలం ముగిసింది. వేలంలో ఫ్రాంఛైజీలు విదేశీ ఆటగాళ్లకే పట్టం కట్టాయి. ఐపీఎల్ 2020 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ అత్యధికంగా రూ.15.50 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సొంతం చేసుకంది. ఫలితంగా యువరాజ్ సింగ్ తర్వాత ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు.

ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్ వెల్(రూ. 10.75 కోట్లు - పంజాబ్), క్రిస్ మోరిస్(రూ. 10 కోట్లు - ఆర్సీబీ), షెల్డన్ కాట్రెల్(రూ.8.50 కోట్లు - పంజాబ్), నాథన్ కౌల్టర్ నైల్(రూ. 8 కోట్లు - ముంబై)లు ఉన్నారు. టాప్-5 అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లే కావడం విశేషం. ఇక, ఆఖరి రౌండ్‌లో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 2 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది.

Auto Refresh Feeds
08:50 pm

రెండో సెషన్ రెండో రౌండ్‌లో అమ్ముడు పోయిన ఆటగాళ్లు

ఢిల్లీకి లలిత్ యాదవ్ - రూ. 20 లక్షలు ఆర్సీబీకి షాదబ్ అహ్మద్ - రూ. 20 లక్షలు రాజస్తాన్‌కు ఆండ్రూ టై - రూ. 1 కోటి రాజస్థాన్‌కు టామ్ కర్రన్ - రూ 1 కోటి ఆర్సీబీకి ఇసురు ఉదాన - రూ. 50 లక్షలు

08:48 pm

కేకేఆర్‌కు నిఖిల్ నాయక్ - రూ. 20 లక్షలు

యవ ఆటగాడు, వికెట్ కీపర్ నిఖిల్ నాయక్‌ను రెండో రౌండ్‌లో కేకేఆర్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.

08:47 pm

ఆర్సీబీకి డేల్ స్టెయిన్ - రూ. 2 కోట్లు

మరోసారి వేలం ప్రారంభమైంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 2 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది.

08:46 pm

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

ఐపీఎల్ 2020 ఎడిషన్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. ఈ మేరకు గురువారం యాజమాన్యం ప్రకటన చేసింది. కోల్‌కతాలో ఐపీఎల్ వేలం సందర్భంగా పంజాబ్ సహా యజమాని నెస్ వాడియా మాట్లాడుతూ "రాబోయే సీజన్‌కు రాహుల్‌ను మా కెప్టెన్‌గా నియమించడం మాకు సంతోషంగా ఉంది. అతను గతేడాది అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పుడు బలంగా తిరిగి వచ్చాడు" అని చెప్పాడు.

08:42 pm

రెండో సెషన్‌లో రౌండ్ 2: ఒక్కో జట్టు ముగ్గురు ఆటగాళ్లను నామినేట్ చేయొచ్చు

దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌కు మరో సువర్ణావకాశం. మరో రౌండ్ ఉంది. ఇందులో ఆయా ప్రాంఛైజీలు ముగ్గురు ఆటగాళ్లను నామినేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి 18 మంది ఆటగాళ్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అతి తక్కువ మంది ఆటగాళ్లను కలిగి ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు 25 మంది ఆటగాళ్లతో తమ కోటాను ముగించేశాయి.

08:36 pm

రెండో సెషన్‌లో కూడా అమ్ముడుపోని ఆటగాళ్లు వీళ్లే

కొలిన్ మున్రో, మార్క్ వుడ్, బెన్ కటింగ్, కేఎస్ భరత్, డానియేల్ సామ్స్, షారుక్ ఖాన్, రోహన్ కదమ్, ఆండ్రూ టై, డేల్ స్టెయిన్, కుశాల్ పెరీరా, సంజయ్ యాదవ్, సౌరభ్ దుబే, వైభవ్ అరోరా, జార్జి గార్డెన్, క్రెసిక్ విలియమ్స్, నాథన్ ఎల్లిస్, అబ్దుల్ సమద్, సుజిత్ నాయక్, యుధవీర్ చరక్, లియాం ప్లంకెట్, జేమ్స్ ప్యాటిన్సన్, కుల్దీప్ సేన్, ఆర్యన్ జుయాల్, సుమిత్ కుమార్, మ్యాట్ హెన్రీ, సీన్ అబ్బాట్, ఇసురు ఉదాన, జాసన్ హోల్డర్, టామ్ కర్రన్, రాహుల్ శుక్లా, నిఖిల్ నాయక్, శామ్స్ ములాని, ప్రవీణ్ దుబే

08:30 pm

రెండో సెషన్‌లో అమ్ముడుపోయిన ఆసీస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ రెండో సెషన్ వేలంలో అమ్ముడుపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మార్కస్ స్టోయినిస్‌ను రూ. 4.8 కోట్లకు కొనుగోలు చేసింది.

08:24 pm

రెండో సెషన్‌లో వేలం ఇలా

రెండో సెషన్‌లో యువ ఆటగాళ్లపై ప్రాంఛైజీలు కన్నేశాయి. ఈ సందర్భంగా పలువురు దేశవాళీ ఆటగాళ్లను కనీస ధరకు సొంతం చేసుకున్నాయి. ఆ ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి చూద్దాం... హైదరాబాద్‌కు సందీప్ భవనక - రూ. 20 లక్షలు... కేకేఆర్‌కు క్రిస్ గ్రీన్ - రూ. 20 లక్షలు... ఆర్సీబీకి జోషువా ఫిలిప్పీ - రూ. 20 లక్షలు.... ముంబైకి మోషిన్ ఖాన్ - రూ. 20 లక్షలు... కేకేఆర్‌కు టామ్ బాంటన్ - రూ. 1 కోటి... హైదరాబాద్‌కు ఫాబియన్ అల్లెన్ - రూ. 50 లక్షలు.... పంజాబ్‌కు క్రిస్ జోర్డాన్ - రూ. 3 కోట్లు.... ఆర్సీబీకి కేన్ రిచర్డ్‌సన్ - రూ. 4 కోట్లు.... రాజస్థాన్‌కు ఓషీన్ థామస్ - రూ. 50 లక్షలు.... కేకేఆర్‌కు ప్రవీణ్ తాంబే - రూ. 20 లక్షలు పంజాబ్‌కు తేజిందర్ ఢిల్లాన్ - రూ. 20 లక్షలు.... హైదరాబాద్‌కు అబ్ధుల్ సమద్ - రూ. 20 లక్షలు.... రాజస్థాన్‌కు అనిరుధ జోషీ - రూ. 20 లక్షలు.... ముంబైకి దిగ్విజయ్ దేశ్‌ముఖ్ - రూ. 20 లక్షలు.... ముంబైకి ప్రిన్స్ బల్వంత్ - రూ. 20 లక్షలు... హైదరాబాద్‌కు సంజయ్ యాదవ్ - రూ.20 లక్షలు... ఢిల్లీకి మోహిత్ శర్మ - రూ. 50 లక్షలు... ఆర్సీబీకి ప్రవీణ్ దేశ్ పాండే - రూ. 20 లక్షలు... పంజాబ్‌కు ప్రభమన్ సింగ్ - రూ. 55 లక్షలు... ఢిల్లీకి తుషార్ దేశ్‌పాండే - రూ. 20 లక్షలు... చెన్నైకి సాయి కిశోర్ - రూ. 20 లక్షలు

06:58 pm

తొలి సెషన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే

Mykhel

ఐపీఎల్ వేలం 2020 తొలి సెషన్ ముగిసింది. తొలి సెషన్‌లో ఫ్రాంఛైజీలు విదేశీ ఆటగాళ్లపైనే కోట్లు కుమ్మరించాయి. ఈ నేపథ్యంలో తొలి సెషన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో ప్యాట్ కమ్మిన్స్(రూ. 15.50 కోట్లు -కేకేఆర్), గ్లెన్ మ్యాక్స్ వెల్(రూ. 10.75 కోట్లు - పంజాబ్), క్రిస్ మోరిస్(రూ. 10 కోట్లు - ఆర్సీబీ), షెల్డన్ కాట్రెల్(రూ.8.50 కోట్లు - పంజాబ్), నాథన్ కౌల్టర్ నైల్(రూ. 8 కోట్లు - ముంబై)లు ఉన్నారు. టాప్-5 అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లే కావడం విశేషం.

06:54 pm

ముగిసిన తొలి సెషన్

ఐపీఎల్ వేలం 2020 తొలి సెషన్ ముగిసింది. నిర్వాహాకులు వేలానికి గంట పాటు విరామం ప్రకటించారు. గంట తర్వాత మళ్లీ అప్ డేట్స్ ఉంటాయి.

06:53 pm

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో నీతా అంబానీ

ఐపీఎల్ వేలంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో నీతా అంబానీ మాట్లాడుతున్న దృశ్యం.

06:51 pm

వేలంలో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇలా

ఐపీఎల్ వేలం 2020 కోల్‌కతాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య సభ్యులు ఇలా సరదాగా ఫోటోకు ఫోజులిచ్చారు.

06:43 pm

చెన్నైకి జోష్ హాజెల్‌ఉడ్ - రూ. 2 కోట్లు

ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజెల్‌ఉడ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది.

06:42 pm

అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే

బరీందర్ శ్రణ్, అన్రిచ్ నోర్ట్జి, మార్క్ వుడ్(ఇంగ్లాండ్), అల్జారి జోసెఫ్(వెస్టిండిస్), ముస్తాపిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్), ఆడమ్ మిల్నే(న్యూజిలాండ్) లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

06:38 pm

పంజాబ్‌కు జిమ్మీ నీషమ్ - రూ. 50 లక్షలు

న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది.

06:37 pm

ఎవిన్ లూయిస్, మనోజ్ తివారి, కొలిన్ ఇన్‌గ్రామ్, మార్టిన్ గుప్టిల్, కార్లోస్ బ్రాత్‌వైట్, మార్కస్ స్టోయినిస్, ఆండిల్ ఫెలుక్వాయో, కొలిన్ మున్రో, రిషి ధావన్, బెన్ కటింగ్‌లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

06:34 pm

హైదరాబాద్‌కు మిచెల్ మార్ష్ - రూ. 2 కోట్లు

కనీసధర రూ. 2 కోట్లకు ఆస్ట్రేలియా అల్ రౌండర్ మిచెల్ మార్ష్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.

06:29 pm

ముంబైకి సౌరభ్ తివారి - రూ. 50 లక్షలు

సౌరభ్ తివారిని ముంబై ఇండియన్స్ రూ. 50 లక్షలు పెట్టి సొంతం చేసుకుంది.

06:28 pm

రాజస్థాన్‌కు డేవిడ్ మిల్లర్ - రూ. 75 లక్షలు

దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్‌ను రాజస్థాన్ రాయల్స్ వేలంలో రూ. 75 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది.

06:26 pm

ఢిల్లీకి షిమ్రాన్ హెట్‌మెయిర్ - రూ. 7.75 కోట్లు

వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ హెట్ మెయిర్ కోసం రాజస్థాన్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. అయితే, చివరకు వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ రూ. 7.75 కోట్లు వెచ్చింది హెట్ మెయిర్‌ను సొంతం చేసుకుంది.

06:05 pm

14 ఏళ్ల చిన్నోడికి చేదు అనుభవం

Mykhel

14 ఏళ్ల ఆప్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌తో పాటు యువ ఆటగాళ్లు సాయి కిసోర్, మిధున్ సుధీశన్‌లను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.

06:02 pm

పంజాబ్‌కు రవి బిష్ణోయి - రూ. 2 కోట్లు

Mykhel

రంజీ ఆటగాడు రవి బిష్ణోయికి మంచి ధర లభించింది. వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అతడిని రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.

06:00 pm

అమ్ముడుపోని ఆటగాళ్లుగా రైలీ మీరితీర్థ్, కేసీ కరియప్ప

దేశవాళీ క్రికెటర్లు రైలీ మీరితీర్థ్, కేసీ కరియప్పలను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.

05:59 pm

కేకేఆర్‌కు సిద్ధార్ధ్ - రూ. 20 లక్షలు

కనీస ధరతో వేలంలోకి వచ్చిన సిద్ధార్ధ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో సొంతం చేసుకుంది.

05:57 pm

పంజాబ్‌కు ఇషాన్ పోరెల్ - రూ. 20 లక్షలు

యువ ఆటగాడు ఇషాన్ పోరెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వేలంలో రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.

05:56 pm

రాజస్థాన్‌కు కార్తీక్ త్యాగి - రూ. 1.30 కోట్లు

రంజీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాడు కార్తీక్ త్యాగిని వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.1.30 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

05:54 pm

తుషార్ దేశ పాండే, కుల్వంత్ ఖేజ్రోలియా, విష్ణు వినోద్‌లను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

05:52 pm

రాజస్థాన్‌కు అక్షయ్ సింగ్ - రూ. 20 లక్షలు

యువ బౌలర్ అక్షయ్ సింగ్‌ను వేలంలో రాజస్థాన్ రాయల్స్ కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.

05:49 pm

అమ్ముడుపోని ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్

Mykhel

యువ ఆటగాడు కేదార్ దేవధర్, ఆంధ్ర రంజీ జట్టు వికెట్ కీపర్ కేఎస్ భరత్‌, ప్రభసిమ్రన్ సింగ్, అంకుష్ బెయిన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

05:47 pm

రాజస్థాన్‌కు అనుజ్ రావత్ - రూ. 80 లక్షలు

టీమిండియా తరుపున ఆడకపోయినప్పటికీ యువ ఆటగాళ్లకు ప్రాంఛైజీలు లక్షలు కుమ్మరిస్తున్నాయి. ఇందులో భాగంగా వికెట్ కీపర్ అనుజ్ రావత్ ను వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 80 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది.

05:45 pm

అమ్ముడుపోని ఆటగాళ్లుగా డానియేల్ శామ్స్, పవన్ దేశ్‌పాండే, షారుక్ ఖాన్

Mykhel

డానియేల్ శామ్స్, పవన్ దేశ్‌పాండే, షారుక్ ఖాన్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.

05:43 pm

రాజస్థాన్‌కు యశస్వి జైస్వాల్ - రూ. 2.4 కోట్లు

వేలంలో యశస్వి జైస్వాల్‌ని కొనుగోలు చేసేందుకు గాను కేకేఆర్, పంజాబ్ జట్లు పోటీ పడ్డాయి. అయితే, మధ్యలో రాజస్థాన్ రాయల్స్ సైతం రేసులోకి వచ్చింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ వేలంలో రూ. 2.4 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది.

05:39 pm

కేకేఆర్‌కు వరుణ్ చక్రవర్తి - రూ. 4 కోట్లు

కర్ణాటకకు చెందిన వరుణ్ చక్రవర్తి కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీ పడ్డాయి. అయితే, వేలంలో చివరకు అతడిని రూ. 4 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది.

05:37 pm

పంజాబ్‌కు దీపక్ హుడా - రూ. 50 లక్షలు

హార్డ్ హిట్టర్ దీపక్ హుడాను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వేలంలో రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది.

05:35 pm

హైదరాబాద్‌కు ప్రిమయ్ గార్గ్ - రూ. 1.9 కోట్లు

వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహారించనున్న ప్రియమ్ గార్గ్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో రూ. కోటి 90 లక్షలకు కొనుగోలు చేసింది.

05:33 pm

హైదరాబాద్‌కు విరాట్ సింగ్ - రూ.1.9 లక్షలు

వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి కొనుగోలు ఇదే. కనీసధర రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన విరాట్ సింగ్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రూ. 1.9 కోట్లు పెట్టిన వేలంలో సొంతం చేసుకుంది.

05:32 pm

కేకేఆర్‌కు రాహుల్ త్రిపాఠి - రూ. 60 లక్షలు

దేశవాళీ క్రికెట్‌లో చక్కటి ప్రదర్శన చేస్తోన్న రాహుల్ త్రిపాఠిని వేలంలో కోల్‌కతా ఫ్రాంచైజీ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది.

05:30 pm

అమ్ముడు పోని ఆటగాళ్లుగా మన్జోత్ కార్లా, రోహన్ కదమ్, హర్‌ప్రీత్ భాటియా

Mykhel

వేలంలోకి కనీస ధరతో వచ్చిన దేశవాలీ ఆటగాళ్లు మన్జోత్ కార్లా, రోహన్ కదమ్, హర్‌ప్రీత్ భాటియాలను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు

05:16 pm

అమ్ముడుపోని ఇష్ సోథీ, ఆడమ్ జంపా, హెడెన్ వాల్ష్, జహీర్ ఖాన్

Mykhel

న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోథీ, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా, ఆప్ఘన్ బౌలర్ జహీర్ ఖాన్, కనీస ధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన విండిస్ స్పిన్నర్ హెడెన్ వాల్ష్ లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

05:14 pm

చెన్నైకి పియూష్ చావ్లా - రూ. 6.75 కోట్లు

పియూష్ చావ్లా కోసం ఆర్సీబీ, చెన్నై, పంజాబ్ ఫ్రాంఛైజీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరకు వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 6.75 కోట్లకు పియూష్ చావ్లాను సొంతం చేసుకుంది.

05:10 pm

పంజాబ్‌కు షెల్డన్ కాట్రెల్ - రూ. 8.5 కోట్లు

వెస్టిండిస్‌కు చెందిన షెల్డన్ కాట్రెల్‌‌ను సొంతం చేసుకునేందుకు ఢిల్లీ, పంజాబ్ పోటీ పడ్డాయి. చివరకు రూ. 8.5 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వేలంలో సొంతం చేసుకుంది.

05:06 pm

అమ్ముడుపోని ఆటగాడిగా టిమ్ సోథీ

Mykhel

న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు.

05:04 pm

ముంబైకి నాథన్ కౌల్టర్ నైల్ - రూ. 8 కోట్లు

ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ కౌల్టర్ నైల్‌ను రూ. 8 కోట్లకు వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు సొంతం చేసుకుంది.

05:02 pm

రాజస్థాన్‌కు జయదేవ్ ఉనాద్కత్ - రూ. 3 కోట్లు

జయదేవ్ ఉనాద్కత్‌ను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ. 3 కోట్లు వెచ్చించి వేలంలో సొంతం చేసుకుంది.

04:54 pm

హెన్రిచ్ క్లాసెన్, ముష్ఫికర్ రహీమ్, నోమన్ ఓజాలపై ఆసక్తి చూపని ప్రాంఛైజీలు

Mykhel

హెన్రిచ్ క్లాసెన్, ముష్ఫికర్ రహీమ్, నోమన్ ఓజా, వెస్టిండిస్ వికెట్ కీపర్ షాయ్ హోప్, మోహిత్ శర్మ, కశాల్ పెరీరా, సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ లను కొనుగోలు చేసేందుకుఏ ప్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.

04:51 pm

ఢిల్లీకి అలెక్స్ క్యారీ - రూ. 2.4 కోట్లు

కనీసధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 2.4 కోట్లకు సొంతం చేసుకుంది.

04:22 pm

ఆర్సీబీకి క్రిస్ మోరిస్

దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్‌ను వేలంలో రూ. 10 కోట్లు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.

04:17 pm

చెన్నైకి శామ్ కర్రన్

ఇంగ్లాండ్ ఆటగాడు శామ్ కర్రన్‌ను రూ. 5.5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో సొంతం చేసుకుంది.

04:13 pm

15.50 కోట్లు పలికిన ప్యాట్ కమిన్స్

కనీస ధర రూ. 2కోట్లతో వేలంలోకి వచ్చిన ఫ్యాట్ కమిన్స్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడ్డాయి. అయితే, చివరకు ప్యాట్ కమిన్స్‌ను అర్సీబీ సొంతం చేసుకుంటుందనే సమయంలో రేసులోకి కేకేఆర్ దూసుకొచ్చింది. దీంతో చివరకు ప్యాట్ కమిన్స్‌ను కేకేఆర్ రూ. 15.50 కోట్లకు కొనుగోలు చేసింది.

04:04 pm

అమ్ముడుపోని ఆటగాళ్లుగా యూసఫ్ పఠాన్, కోలిన్ డీ గ్రాండ్‌హోమ్

Mykhel

యూసఫ్ పఠాన్, కోలిన్ డీ గ్రాండ్‌హోమ్‌లను ఏ ప్రాంఛైజీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

04:03 pm

రూ. కోటిన్నర పలికిన క్రిస్ వోక్స్

Mykhel

కనీస ధర రూ. కోటిన్నరతో వేలంలోకి వచ్చిన క్రిస్ వోక్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

04:01 pm

రూ.10.75 కోట్లు పెట్టి మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసిన పంజాబ్

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కోసం ఢిల్లీ, పంజాబ్ ఫ్రాంఛైజీలు తెగ పోటీపడ్డాయి. చివరకు వేలంలో మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

03:52 pm

ఆర్సీబీకి ఆరోన్ పించ్

కనీస ధర రూ. కోటితో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను ఆర్సీబీ రూ.4.40 కోట్లకు సొంతం చేసుకుంది. ఆరోన్ ఫించ్ కోసం కోల్‌కతా, బెంగళూరు ఫ్రాంఛైజీల మధ్య హోరాహోరీ నడిచింది.

03:47 pm

ఢిల్లీకి జేసన్ రాయ్

ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. కోటిన్నరకు వేలంలో సొంతం చేసుకుంది.

03:45 pm

అమ్ముడుపోని హనుమ విహారి, ఛటేశ్వర్ పుజారా

కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన భారత టెస్టు ఆటగాళ్లు హనుమ విహారి, ఛటేశ్వర్ పుజారాలను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

03:44 pm

రాజస్థాన్‌కు రాబిన్ ఊతప్ప

రాబిన్ ఊతప్పను రూ. 3 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది.

03:41 pm

కోల్‌కతాకు ఇయాన్ మోర్గాన్

ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను రూ. 5.25 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.

03:38 pm

ముంబైకు క్రిస్ లిన్

క్రిస్ లిన్‌ను కనీస ధర రూ. 2 కోట్లకు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్. ఈ వేలంలో అమ్ముడు పోయిన మొట్టమొదటి ఆటగాడిగా క్రిస్ లిన్ అరుదైన ఘనత సాధించాడు.

03:37 pm

ప్రారంభమైన ఐపీఎల్ వేలం

కోల్‌కతా వేదికగా ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.

03:34 pm

వేలానికి సిద్ధంగా ఉన్న ప్రీతి జింటా

ఈ వేలంలో ఎక్కువ నగదు కలిగిన జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఆ జట్టు సహాయజమాని ప్రీతి జింటా వేలానికి సిద్ధమైంది. గత సీజన్‌లో పంజాబ్ తరుపున చక్కటి ప్రదర్శన చేసిన క్రిస్ గేల్‌ను తిరిగి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అయితే, ఈ సీజన్‌లో పంజాబ్ టామ్ బాంటన్? లేదా క్రిస్ లిన్? ఎవరిని కొనుగోలు చేస్తుందో చూడాలి మరి.

03:19 pm

మరో పది నిమిషాల్లో ప్రారంభం కానున్న వేలం

మరో పది నిమిషాల్లో ఐపీఎల్ వేలం 2020 ప్రారంభం కానుంది. ఇదిగో ఇక్కడే ఐపీఎల్ వేలం జరగనుంది.

03:17 pm

BREAKING: మూడో వన్డే నుంచి తప్పుకున్న దీపక్ చాహర్

టీమిండియా పేసర్ దీపర్ చాహర్ గాయం కారణంగా మూడో వన్డే నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఢిల్లీ పేసర్ నవదీప్ షైనీని జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. ఐపీఎల్‌లో దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

03:14 pm

ఐపీఎల్ వేలాన్ని ప్రభావితం చేయనున్న విండిస్ ఆటగాళ్లు

ఐపీఎల్ వెస్టిండిస్ ఆటగాళ్లు ఎప్పటి నుంచో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్న విండిస్ ఆటగాళ్లు క్రిస్ గేల్, సునీల్ నరైన్, డ్వేన్ బ్రావో, కీరోన్ పొలార్డ్ మరియు డ్వేన్ స్మిత్ ఆయా జట్ల తరుపున కీలకపాత్ర పోషించడంతో పాటు ఐపీఎల్ టైటిల్‌ సాధించడంలో కీలకంగా వ్యవహారించారు. విండిస్ ఆటగాడు షిమ్రాన్ హెట్ మెయిర్‌ను ఐపీఎల్ వేలానికి ముందే ఆర్సీబీ విడుదల చేసింది. అయితే, చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో హెట్‌మెయిర్ సెంచరీ సాధించి తానెంటో నిరూపించుకున్నాడు.

02:50 pm

వేలానికి హాజరైన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం కోల్‌కతా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హాజరయ్యాడు. ఐపీఎల్ వేలం మధ్యాహ్నాం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. గతేడాది వేలం నిర్వహించిన హ్యూ ఎడ్మీడ్స్ ఈసారి కూడా వ్యాఖ్యాతగా వ్యవహారిస్తున్నారు.

02:42 pm

మద్యాహ్నాం 3.30 గంటలకు ఐపీఎల్ వేలం ప్రారంభం

ఐపీఎల్ వేలం 2020 మద్యాహ్నాం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఈ వేలం కోల్‌కతా వేదికగా జరుగుతుంది. ఇప్పటివరకు అన్ని సీజన్ల కోసం జరిగిన ఐపీఎల్ వేలం బెంగళూరు వేదికగా జరిగిన సంగతి తెలిసిందే.

02:37 pm

అత్యధిక నగదు కలిగిన ఉన్న ఫ్రాంచైజీగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్

ఈ వేలంలో అత్యధిక నగదు ఉన్న ప్రాంఛైజీగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఉండగా... అతి తక్కువ నగదు కలిగిన జట్టుగా ముంబై ఇండియన్స్ ఉంది. ఈ వేలంలో పంజాబ్ వద్ద అత్యధికంగా రూ. 42.7 కోట్లు ఖర్చు చేయనుండగా... అత్యల్పంగా ముంబై ఇండియన్స్ రూ. 13.05 కోట్లు ఖర్చు చేయనుంది. ఒక్కో జట్టులో గరిష్టంగా ఉండే ఆటగాళ్ల సంఖ్య - 25 గరిష్టంగా విదేశీ ఆటగాళ్ల సంఖ్య - 8

02:34 pm

చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ప్లెమింగ్ ఇలా

చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ వేలంలో ఫ్రాంచైజీ కొంచెం స్మార్ట్‌గా వ్యవహారిస్తోందని అన్నారు. మా జాబితాలో ఉన్న ఆటగాళ్లను కోల్పోవటానికి సిద్ధంగా ఉందని, ఇతర జట్లతో పోలిస్తే తమ వద్ద తక్కువ డబ్బు ఉందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

02:23 pm

ఇప్పటివరకు ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు వీరే:

2008 - ఎంఎస్ ధోని (CSK) 2009 - ఆండ్రూ ఫ్లింటాఫ్ (CSK), కెవిన్ ఫ్లింటాఫ్ (RCB) 2010 - షేన్ బాండ్ (KKR), కీరోన్ పొలార్డ్ (MI) 2011 - గౌతమ్ గంభీర్ (KKR) 2012 - రవీంద్ర జడేజా (CSK) 2013 - గ్లెన్ మాక్స్వెల్ (MI) 2014 - యువరాజ్ సింగ్ (RCB) 2015 - యువరాజ్ సింగ్ (DD) 2016 - షేన్ వాట్సన్ (RCB) 2017 - బెన్ స్టోక్స్ (RPS) 2018 - బెన్ స్టోక్స్ (RR) 2019 - జయదేవ్ ఉనద్కట్ (RR), వరుణ్ చక్రవర్తి (KXIP) 2020 -?

02:19 pm

ఉనాద్కత్ విషయంలో గత సీజన్‌లో పలికిన ధర నిలుస్తుందా?

గత సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఉనాద్కట్‌పై ఆశ్చర్యకరంగా రూ. 11.5 కోట్లు వెచ్చించింది. కానీ అతడు అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో వేలానికి విడుదల చేసింది. ఈ వేలంలో అంత ధర పలకడం పక్కన పెట్టి అతడివైపు ఫ్రాంచైజీలు మొగ్గుచూపుతాయా అనేది తేలాల్సి ఉంది.

01:31 pm

కోల్‌కతా నైట్ రైడర్స్

వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద మిగిలిన నగదు, కొనుగోలు చేయనున్న ఆటగాళ్ల వివరాలు ఇవే: మిగిలిన నగదు: INR 35.65 crore, వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు: 11, విదేశీ ఆటగాళ్లు: 4

01:26 pm

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వద్ద మిగిలిన నగదు, కొనుగోలు చేయనున్న ఆటగాళ్ల వివరాలు ఇవే: మిగిలిన నగదు: INR 42.7 crore, వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు: 9, విదేశీ ఆటగాళ్లు: 4

01:25 pm

వేలంలో అత్యల్ప, అత్యధిక వయుసు కలిగిన ఆటగాళ్లు వేరే

ఐపీఎల్‌ 2020 వేలానికి వేళైంది. మరికొద్ది గంటల్లో కోల్‌కతా వేదికగా ఈ వేలం ప్రారంభం కానుంది. అయితే, ఈ వేలంలో ఆటగాళ్లలో ఆప్ఘనిస్థాన్‌కు చెందిన నూర్‌ అహ్మద్‌ అత్యంత పిన్న వయస్కుడు కాగా.. అత్యంత పెద్ద వయస్కుడిగా ప్రవీణ్‌ తాంబే నిలిచాడు. కాబూల్‌కు చెందిన నూర్‌ వయసు కేవలం 14ఏళ్ల 350 రోజులే. ఇటీవల భారత్‌తో జరిగిన అండర్‌-19 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో ఫ్రాంఛైజీల దృష్టి నూర్‌పై పడింది. నూర్‌ను కొనుగోలు చేసేందుకు రాజస్థాన్‌ రాయల్స్‌ ఆసక్తి చూపిస్తోంది. ఇక, ద్దరు పిల్లల తండ్రైన ప్రవీణ్‌ తాంబే వయసు 48ఏళ్లు.

01:22 pm

రాజస్థాన్ రాయల్స్

వేలంలో రాజస్థాన్ రాయల్స్ వద్ద మిగిలిన నగదు, కొనుగోలు చేయనున్న ఆటగాళ్ల వివరాలు ఇవే: మిగిలిన నగదు: INR 28.9 crore, వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు: 11, విదేశీ ఆటగాళ్లు: 4

01:21 pm

ఢిల్లీ క్యాపిటల్స్

వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద మిగిలిన నగదు, కొనుగోలు చేయనున్న ఆటగాళ్ల వివరాలు ఇవే: మిగిలిన నగదు: INR 27.85 crore, వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు: 11, విదేశీ ఆటగాళ్లు: 5

01:00 pm

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద మిగిలిన నగదు, కొనుగోలు చేయనున్న ఆటగాళ్ల వివరాలు ఇవే: మిగిలిన నగదు: INR 27.9 crore, వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు: 12, విదేశీ ఆటగాళ్లు: 6

12:59 pm

సన్‌రైజర్స్ హైదరాబాద్

వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద మిగిలిన నగదు, కొనుగోలు చేయనున్న ఆటగాళ్ల వివరాలు ఇవే: మిగిలిన నగదు: INR 17 crore, వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు: 7, విదేశీ ఆటగాళ్లు: 2

12:47 pm

ముంబై ఇండియన్స్

వేలంలో ముంబై ఇండియన్స్ వద్ద మిగిలిన నగదు, కొనుగోలు చేయనున్న ఆటగాళ్ల వివరాలు ఇవే: మిగిలిన నగదు: INR 13.05 crore, వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు: 7, విదేశీ ఆటగాళ్లు: 2

12:20 pm

చెన్నై సూపర్ కింగ్స్

వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వద్ద మిగిలిన నగదు, కొనుగోలు చేయనున్న ఆటగాళ్ల వివరాలు ఇవే: మిగిలిన నగదు: INR 14.6 crore, వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు: 5, విదేశీ ఆటగాళ్లు: 2

12:12 pm

గత సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్ జయదేవ్ ఉనద్కట్‌పై రూ. 11.5 కోట్లు వెచ్చించింది. కానీ.. ఉనద్కట్‌ అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో వేలానికి విడుదల చేసింది. ఈ వేలంలో అంత ధర పలకడం పక్కన పెట్టి అతడిని ఫ్రాంచైజీలు తీసుకోవడానికి మొగ్గుచూపుతాయా అనేది తేలాల్సి ఉంది.

11:45 am

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్విటర్‌ వేదికగా అభిమానులకు ఒక సందేశాన్ని పంపాడు. 13వ ఐపీల్‌ సీజన్‌లో బెంగళూరు ప్రాంచైజీ స్ట్రాంగ్ టీమ్‌ను చూడనున్నారు అని కోహ్లీ తెలిపాడు. వేలంలో బెంగళూరు జట్టు ప్రణాళిక ప్రకారం ఆటగాళ్లను ఎంచుకుంటుంది. అన్ని విభాగాల్లో సమతుల్యం ఉన్న ఆటగాళ్లను ప్రాంచైజీ తీసుకోబోతున‍్నట్లు పేర్కొన్నాడు.

11:40 am

వేలంలో భారీ ధర పలికే ఆటగాళ్లు వీరే:

11:14 am

ఈసారి ఐపీఎల్‌ వేలంలో ఆంధ్ర నుంచి ఆరుగురు ఆటగాళ్లు హనుమ విహారి, భరత్, రికీ భుయ్, స్టీఫెన్, పృథ్వీరాజ్, ఇస్మాయిల్‌.. హైదరాబాద్‌ నుంచి నలుగురు ప్లేయర్లు సందీప్, తిలక్‌ వర్మ, యుద్‌వీర్, మిలింద్‌ ఉన్నారు.

10:43 am

ఐపీఎల్‌ 2020 సీజన్‌ వేలం వివరాలు... వేదిక: కోల్‌కతా, వేలం ప్రారంభమయ్యే సమయం: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు, టీవీ ఛానల్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్లైవ్ స్ట్రీమింగ్: హాట్ స్టార్ (యాప్, వెబ్‌సైట్)

10:11 am

టెస్టు ఆటగాళ్లు హనుమ విహారి, ఛతేశ్వర పుజారా రూ. 50 లక్షల ప్రాథమిక ధరతో ఉన్నారు. గత సీజన్‌లో ఢిల్లీకి ఆడిన విహారిని విడుదల చేయగా.. పుజారాను ఎవరూ కొనలేదు. మరి ఈసారి వీరిని ఎవరన్నా కొనుగోలు చేస్తారో లేదో చూడాలి.

09:47 am

శ్రీలంక సీనియర్‌ ప్లేయర్‌ ఏంజెలో మాథ్యూస్‌, సఫారీ పేసర్‌ స్టెయిన్‌ ప్రారంభ ధర రూ.2 కోట్లతో ఉండగా.. వీరిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయా అనేది చూడాలి.

09:09 am

దేశవాళీల్లో అదరగొట్టిన ప్రియం గార్గ్, యశస్వి జైస్వాల్‌, ఆర్‌. సాయి కిషోర్‌ లాంటి యువ ఆటగాళ్లపైనా ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నారు. బెంగాల్‌ పేసర్‌ ఇషాన్‌ పోరెల్‌ కోసం డిమాండ్‌ ఏర్పడింది. వీరి కనీస ధర రూ. 20 లక్షలు.

08:55 am

తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భారత వెటరన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే (48) కూడా ఆశగా ఎదురుచూస్తున్నాడు. క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో ఇతగాడు ఇంకా ఆడుతున్నాడు. కుర్రాళ్లను కాదని 48 ఏళ్ల తాంబేను ఫ్రాంఛైజీలు కొనుక్కుంటారో లేదో చూడాలి.

08:29 am

లీగ్‌లో వేలానికి రానున్న వారిలో పిన్న వయస్కుడైన అప్ఘానిస్థాన్‌ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ (14) హాట్‌కేక్‌గా అమ్ముడయ్యే అవకాశం ఉంది. నూర్‌ కనీస ధర రూ. 30 లక్షలు. ఇతగాడు లెఫ్టామ్‌ చైనామన్‌ స్పిన్నర్‌.

08:01 am

వేలంలో 332 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు ఆటగాళ్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్, లిన్, మిచెల్‌ మాల్స్, కమిన్స్, హాజల్‌వుడ్‌లకు అత్యధిక మొత్తం లభించే అవకాశముంది.

07:54 am

మరోసారి హాట్ కేకుల్లా మారుతున్న వెస్టిండీస్ ప్లేయర్స్.

07:53 am

భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో చెలరేగుతున్న షిమ్రాన్ హెట్‌మైర్‌కు భారీ ధర పలికే అవకాశం.

05:02 am

వేలం కోసం స్టేజి సిద్ధమైంది. ఈ వేలంలో పాల్గొనే మొత్తం ఎనిమిది ప్రాంచైజీలు 73 మందిని ఎంపిక చేసుకోనున్నాయి. ఇందులో 29 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉంది.

04:48 am

ఆర్సీబీ విదేశీ ఆటగాళ్ళపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. దీంతో వచ్చే సీజన్ కోసం జరగనున్న ఐపీఎల్ వేలంలో ఫ్రాంఛైజీలు యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపే అవకాశముంది. జట్టును కొత్త వారితో నింపడం ద్వారా మరింత మెరుగైన ఆటతీరు కనబర్చాలని భావిస్తున్నాయి. దీంతో ఈసారి వేలంలో పలువురు విదేశీ క్రికెటర్లు భారీ ధర పలికే అవకాశం ఉంది.