న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mumbai Indians జట్టులో అర్జున్‌ టెండూల్కర్.. ‌ట్రెంట్ బౌల్ట్‌తో కలిసి..!!

IPL 2020: Arjun Tendulkar joined Mumbai Indians?

అబుదాబి: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం‌ ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందుకు కారణం అర్జున్ టెండూల్కర్‌ పోస్ట్ చేసిన ఓ ఫొటోనే. ఇప్పటికే యూఏఈకి చేరుకున్న అర్జున్.. అక్కడి నిబంధనల ప్రకారం క్వారంటైన్‌ని పూర్తి చేసుకుని ముంబై జట్టుతో కలిసి నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ వారసుడైన అర్జున్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగే​ట్రం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాదిలో ఎక్కువ నెలలు ఇంగ్లండ్‌లో గడుపుతూ అంతర్జాతీయ ఆరంగేట్రం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

స్విమ్మింగ్ ఫూల్‌లో అర్జున్:

తాజాగా అర్జున్ టెండూల్కర్‌కు సంబందించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫొటోలో ముంబై ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్, ఇతర ఆటగాళ్లతో కలిసి స్విమ్మింగ్ ఫూల్‌లో అర్జున్ సేద తీరుతున్నాడు. అందులో అందరూ విక్టరీ సింబల్ చూపిస్తున్నాడు. ఫొటోలో ఉన్న అందరూ బౌలేర్లే కావడం విశేషం. ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది. భారత దిగ్గజం సచిన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముంబై జట్టులోకి అర్జున్‌ని తీసుకున్నట్లు ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

నెట్స్‌లో బౌలింగ్?:

నెట్స్‌లో బౌలింగ్?:

ఐపీఎల్ 2020 కోసం ఆగస్టు 20 తర్వాత టోర్నీలోని ఎనిమిది జట్లు యూఏఈ చేరుకున్నాయి. యూఏఈకి వెళ్లే క్రమంలో అన్ని జట్లు కూడా తమతో పాటు నెట్స్‌ బౌలర్లని కూడా వెంట తీసుకెళ్లాయి. నెట్స్‌లో బౌలింగ్ చేసేందుకు అర్జున్ టెండూల్కర్ కూడా ముంబై జట్టు‌తో కలిసి వెళ్లినట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ చెప్పలేదు. తాజాగా అర్జున్ ఫొటో బయటకు రావడంతో.. అతడు ముంబై జట్టుతో కలిసి ఉన్నాడని తెలిసింది. ముంబై జట్టుకు నెట్‌ బౌలర్లలో ఒకడిగా అర్జున్‌ వ్యవహరిస్తున్నాడట.

ఏ క్రికెటరైనా గాయపడితే?

ఏ క్రికెటరైనా గాయపడితే?

ఐపీఎల్ టోర్నీ జరుగుతున్న సమయంలో ఏ క్రికెటరైనా గాయపడితే.. అతని స్థానంలో మరొక ఆటగాడిని సదరు ప్రాంచైజీ తీసుకునే వెసులబాటుని బీసీసీఐ కల్పిస్తోంది. అయితే అతడు వేలంలోకి వచ్చి ఉండాలని గత ఏడాది వరకూ ఒక రూల్ ఉంది. ఇప్పుడు మాత్రం అలా లేదట. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వేలంలోకి రాకపోయినా సదరు ఆటగాడు యూఏఈలో ఉండి, బయో బబుల్ పరిధిలో ఉంటే తీసుకోవచ్చని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ చెప్పినట్లు సమాచారం. ఇదే నిజమయితే.. టోర్నీ జరుగుతున్న సమయంలో ఎవరైనా గాయపడితే ముంబై జట్టులోకి అర్జున్ టెండూల్కర్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

టీమిండియా ఆటగాళ్లకు కూడా:

టీమిండియా ఆటగాళ్లకు కూడా:

అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టుకు బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా బౌలింగ్ చేశాడు. అంతేకాదు.. టీమిండియా ఆటగాళ్లకు కూడా అతడు నెట్ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్.. ఇప్పటి వరకూ అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్‌ ఆడలేదు. కానీ తరచూ మీడియాలో అతని పేరు వినిపిస్తూనే ఉంది. సచిన్ టెండూల్కర్ కుమారుడు కావడంతో ప్రస్తుతం మైదానంలో అర్జున్ ప్రదర్శన కంటే.. జట్టులోకి అతని ఎంపికపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.

Mumbai Indians: ఐపీఎల్ ప్రత్యర్థి కంటే.. వాతావరణమే అసలు సమస్య: స్టార్ పేసర్

Story first published: Tuesday, September 15, 2020, 10:41 [IST]
Other articles published on Sep 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X