IPL 2020: తేదీ, వేదిక, వేలం, మిగిలిన నగదు, టీవీ ఇన్ఫో వివరాలు!

హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుంది. దీంతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదులుకున్నాయి. మొత్తంగా 8 జట్లు 71 మంది ప్లేయర్లను వేలానికి విడుదల చేశాయి. ఇందులో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.
అన్ని ఫ్రాంఛైజీలు కలిపి మొత్తంగా 127 మంది ఆటగాళ్లను కొనసాగించాయి. తమ ప్రధాన ప్లేయర్లను అట్టిపెట్టుకోగా.. కొన్ని ప్రాంఛైజీలు స్టార్ ఆటగాళ్లను సైతం వదులుకున్నాయి. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అత్యధికంగా 12 మందిని విడుదల చేయగా.. అత్యల్పంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని విడుదల చేసింది.
ఐపీఎల్ 2020 వేలానికి సంబంధించిన తదితర వివరాలు మీకోసం...

వేలం ఎప్పుడు జరుగుతుంది?
డిసెంబర్ 19, 2019న ఐపీఎల్ వేలం జరగనుంది. ఇండియాలోని పలు వేదికల్లో ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్ మెగా టోర్నీ జరగనుంది. ముంబై ఇండియన్స్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతోంది. గత సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక పరుగు తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.

వేలం ఎక్కడ జరుగుతుంది?
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి కోల్‌కతా ఐపీఎల్ వేలానికి ఆతిథ్యమిస్తోంది. రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇది హోం వెన్యూ కావడం విశేషం. సిటీ ఆఫ్ జోయ్‌గా పేర్కొనే కోల్‌కతా తొలిసారి ఐపీఎల్ వేలానికి ఆతిథ్యమిస్తోంది. ఇప్పటివరకు ఐపీఎల్ వేలానికి బెంగళూరు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.

వేలంలో ఎంత మంది ఆటగాళ్లు ఉన్నారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోని 8 ప్రాంఛైజీలు 71 మంది ప్లేయర్లను వేలానికి విడుదల చేశాయి. ఇందులో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరింతా వేలంలో అందుబాటులో ఉంటారు. వీరితో పాటు కొత్తగా వేలంలో రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్లు సైతం ఆయా ప్రాంఛైజీలు వేలంలో కొనుగోలు చేయొచ్చు.

ఫ్రాంఛైజీల వద్ద ఉన్న మిగిలిన నగదు ఎంత?
రాజస్థాన్ రాయల్స్: రూ.28.90 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ.27.90 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ.17 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రూ.14.60 కోట్లు
ముంబై ఇండియన్స్: రూ.13.05 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: రూ.27.85 కోట్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: రూ.42.70 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్: రూ.35.65 కోట్లు

టీవీ ఇన్ఫో
ఐపీఎల్ 2020 వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. దీంతో పాటు వేలాన్ని హాట్ స్టార్‌లో కూడా వీక్షించొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications