Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: డివిలియర్స్‌ ఈజ్‌ బ్యాక్‌.. భారీ షాట్లతో అలరించిన ఏబీ!!

IPL 2020: AB de Villiers hits the nets in UAE

దుబాయ్: క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020కి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా లీగ్ ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్ 2020 కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ గతవారం దక్షిణాఫ్రికా నుండి నేరుగా దుబాయ్ చేరుకున్నాడు. దుబాయ్‌కి చేరుకోగానే.. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్‌ సమయంలో చేసిన మూడు కరోనా టెస్టుల్లో అతనికి నెగటివ్ అని తేలింది. దీంతో ఆదివారం వారం నుంచి నెట్స్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు.

దాదాపు ఐదు నెలల తర్వాత ఆదివారం మైదానంలోకి అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌‌ ఏబీ డివిలియర్స్ మునుపటిలా తన షాట్లతో అలరించాడు. నెట్ బౌలర్లు వేసే బంతులను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. తొలుత డిఫెన్స్ ఆడినా.. ఆ తర్వాత వేగం పెంచాడు. ప్రతిఒక్కరి బౌలింగ్లో భారీ షాట్లు ఆడాడు. దీంతో డివిలియర్స్‌ ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడతాడా అని ఎదురు చూస్తున్న బెంగళూరు అభిమానులకు ఎట్టకేలకు నిరీక్షణ తప్పింది.

ప్రాక్టీస్‌ సెషన్ అనంతరం ఏబీ డివిలియర్స్ మీడియాతో మాట్లాడుతూ... 'చాలా రోజుల తర్వాత ఈ నెట్స్‌ సెషన్‌ అద్భుతంగా సాగింది. నేనెంతో ఆస్వాదించా. పిచ్‌ కాస్త పచ్చికగానే ఉన్నా.. నేను అనుకున్నట్లే సాధన సాగింది. అయితే ఇన్ని రోజుల తర్వాత మళ్లీ బ్యాట్‌ పట్టడం సవాలుగా మారింది. ఆటలోని ప్రాథమిక సూత్రాలు మరిచిపోలేదు. బంతిని గమనించే షాట్లు ఆడా. ఎంతో కసిగా, శ్రద్ధతో తొలి సెషన్‌ను పూర్తి చేశాను. తొలి సెషన్‌ను ఏంతో ఆస్వాదించా' అని తెలిపాడు.

ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్ ఓపెనింగ్ చేయబోతున్నారా అని ఆర్‌సీబీ జట్టు డైరెక్టర్‌ మైక్‌ హెస్సన్‌ను అడగ్గా... 'రెండు గంటల సమావేశంలో ఇప్పటివరకు కోహ్లీ, ఫించ్ ఎక్కడ బ్యాటింగ్ చేస్తారో అని ఎవరూ అడగలేదు. నేను కూడా వారిద్దరు ఓపెనింగ్ చేస్తారా అనే దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. మా వ్యూహంలో భాగంగా దానిపై ఇప్పుడేమీ చెప్పలేను. ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరం వేచి చూద్దాం' అని పేర్కొన్నాడు.

ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ... ఐదు నెలల తర్వాత బ్యాట్‌ పట్టడంతో తొలుత తాను కాస్త భయపడినట్లు చెప్పాడు. అయితే తాము ఊహించినదాని కంటే తర్వాత ప్రాక్టీస్‌ బాగా జరిగిందని వెల్లడించాడు. ఆర్సీబీ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ, ఏబీ ఇద్దరూ ప్రాక్టీస్‌ చేయడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఈ సారైనా వీరిద్దరూ ఆ జట్టుకు టైటిల్‌ సాధిస్తారని ఆశిస్తున్నారు.

Story first published: Monday, August 31, 2020, 15:11 [IST]
Other articles published on Aug 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+