DC vs CSK: జడేజా భారీ సిక్సర్.. బంతి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని అభిమాని (వీడియో)!!

IPL 2020: CSK v DC | Fan Risks Life To Collect Ball After Jadeja’s Massive Six | Oneindia Telugu

షార్జా: ఐపీఎల్‌-13లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తడబాటు కొనసాగుతోంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో చెన్నై 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. శిఖర్‌ ధావన్‌ (101 నాటౌట్‌; 58 బంతుల్లో 14×4, 1×6) శతకానికి.. అక్షర్‌ పటేల్‌ (21 నాటౌట్‌; 5 బంతుల్లో 3×6) మెరుపులు తోడవడంతో 180 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో ఛేదించింది.

మొదట ఫాఫ్ డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో 6×4, 2×6), అంబటి రాయుడు (45 నాటౌట్‌; 25 బంతుల్లో 1×4, 4×6), రవీంద్ర జడేజా (33 నాటౌట్‌; 13 బంతుల్లో 4×6) సత్తా చాటడంతో చెన్నై 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. 9 మ్యాచ్‌ల్లో ఆరో ఓటమి చవిచూసిన చెన్నై ప్లేఆఫ్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

జడేజా భారీ సిక్సర్

చెన్నై ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా వీరవిహారం చేశాడు. అంతకుందు నత్తనడక నడిచిన చెన్నై స్కోర్ బోర్డు.. జడేజా క్రీజులోకి వచ్చిన తర్వాత పరుగులు తీసింది. 13 బంతుల్లో 4 సిక్సులతో 33 పరుగులు చేశాడు. అయితే తుషార్‌ దేశ్‌పాండే వేసిన 18వ ఓవర్లో స్క్వేర్ లెగ్ సైడ్ జడేజా బాదిన సిక్సర్ ఏకంగా మైదానం బయటపడింది. రోడ్డు మధ్యలో పడిన ఆ బంతిని తీయడానికి ఒక అభిమాని రిస్క్‌ చేయడం కెమెరాల్లో రికార్డయ్యింది. బంతి కోసం గ్రౌండ్‌ బయట వేచి చూస్తున్న ఆ అభిమాని రోడ్డు మధ్యలోకి పరుగెత్తి దాన్ని తీయడం కామెంటేటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

అభిమాని సాహసం

అభిమాని సాహసం

నడి రోడ్డుపై పడిన బంతిని తీసుకున్న ఆ అభిమాని డేరింగ్‌ను కామెంటేటర్లు మెచ్చుకున్నారు. అయితే వీకెండ్‌లో అలా రోడ్డు మధ్యలోకి రావడం చాలా రిస్క్‌ అని కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ అన్నారు. అసలు వీకెండ్‌లో రోడ్డుపై తనకు పరుగెత్తే అవకాశమే ఉండదంటూ అది ఎంత ప‍్రమాదకరమో అనే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. బంతిని ఇంటికి తీసుకెళ్లడం కోసం ఇలా ఫ్యాన్స్‌ బయట వేచి చేయడం ఈ ఐపీఎల్‌లో చర‍్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆ అభిమానికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన ఎవరు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

21 బంతుల్లోనే 50 పరుగులు

21 బంతుల్లోనే 50 పరుగులు

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్‌ మూడో బంతికి సామ్‌ కరన్‌ (0) ఔటయ్యాడు. డుప్లెసిస్‌, వాట్సన్‌ నెమ్మదిగా ఆడటంతో 9 ఓవర్లు ముగిసే సరికి ధోనీ సేన 56/1తో నిలిచింది. రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించాక వాట్సన్‌ ఔట్‌ కాగా.. అర్ధసెంచరీ అనంతరం డుప్లెసిస్‌ వెనుదిరిగాడు. క్రీజులో ఇబ్బందిగా కనిపించిన ఎంఎస్ ధోనీ (3)ని నోర్జే పెవిలియన్‌ పంపాడు. అప్పటికే రెండు సిక్సర్లతో మంచి జోష్‌లో ఉన్న రాయుడుకు జడేజా జతకలవడంతో అగ్నికి వాయువు తోడైనైట్లెంది. రబాడ వేసిన 19వ ఓవర్‌లో జడేజా, రాయుడు చెరో సిక్సర్‌ కొడితే.. చివరి ఓవర్‌లో జడ్డూ మరో రెండు సిక్సర్లు బాదాడు. ఈ జంట అభేద్యమైన ఐదో వికెట్‌కు 21 బంతుల్లోనే 50 పరుగులు జోడించింది.

డివీలియర్స్ కూడా బాదాడు

డివీలియర్స్ కూడా బాదాడు

కోల్‌కతా నైట్‌రైడర్స్ ‌(కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఆటగాడు ఏబీ డివీలియర్స్ కొట్టిన ఓ సిక్స్ 86 మీటర్లు వెళ్లింది. అయితే షార్జా మైదానం చిన్నదిగా ఉండడంతో ఏబీ బాదిన బంతి.. రోడ్డుపై వెళుతున్న ఒక కారుకు తగిలింది. దీంతో ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆపై రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

DC vs CSK: ఢిల్లీ చేతిలో పరాజయం.. చెన్నై ముంచిన ఆ నాలుగు తప్పిదాలు ఇవే!!

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, October 18, 2020, 9:56 [IST]
Other articles published on Oct 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X