ఐపీఎల్ వేలం 2020: గెలుపు గుర్రాల కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఆరా!

హైదరాబాద్: డిసెంబర్ 19న కోల్‌కతా వేదికగా ఐపీఎల్ 2020 వేలం జరగనున్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఇప్పటికే విడుదల చేసిన ఫ్రాంఛైజీలు వచ్చే సీజన్‌లో తమ జట్టుకు కావాల్సిన గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి.
ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆచిచూచి వ్యవహారించనున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో అనేక మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు వాకిట బోల్తా పడింది. ఇందులో భాగంగా సీనియర్ క్రికెటర్ల అనుభవాన్ని వినియోగించుకోవడం కోసం రహానే, అశ్విన్ వంటి స్టార్ క్రికెటర్లను జట్టులోకి తీసుకుంది.

జట్టును మరింత పటిష్ట పరిచేందుకు
అయితే జట్టును మరింత పటిష్ట పరిచేందుకు జట్టు కూర్పులో భాగంగా వేలంలో ముగ్గురు క్రికెటర్లను ఎట్టిపరిస్థితుల్లో చేజిక్కించుకోవాలని ఢిల్లీ యాజమాన్యం భావిస్తోందట. ఆ ముగ్గురు ఎవరో కాదు ఆరోన్ ఫించ్, అలెక్స్ క్యారీ, క్రిస్ వోక్స్. వేలంలో ఈ ముగ్గురికి ఎంత ధరైనా చెల్లించేందుకు ఢిల్లీ యాజమాన్యం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ ఓపెనింగ్
శిఖర్ ధావన్, పృథ్వీ షాలతో ఢిల్లీ ఓపెనింగ్ చాలా బలంగా ఉంది. అయితే వీరిద్దరూ విఫలమైతే టాపార్డర్ పెద్దగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో టాపార్డర్‌లో మరో హిట్టర్ ఉండే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆరోన్ ఫించ్‌ను తీసుకోవాలని భావిస్తోంది. రిషభ్ పంత్‌కు బ్యాకప్ కీపర్‌గా పేరుగాంచిన మరో ఆటగాడు ఢిల్లీ జట్టులో లేడు.

బ్యాకప్ వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ
దీంతో బ్యాకప్ వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను వదులుకున్న ఢిల్లీ అతడి స్థానంలో క్రిస్ వోక్స్‌ను తీసుకోవాలని భావిస్తోంది. కోల్‌కతా వేదికగా డిసెంబర్ 19న జరగనున్న వేలంలో 332 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కనీస ప్రాథమిక ధర రూ. 2 కోట్లలో ఉన్నది వీరే
ఈ వేలంలో కనీస ప్రాథమిక ధర రూ. 2 కోట్లుగా ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, కమిన్స్, హాజల్‌వుడ్, మార్ష్, స్టెయిన్, మాథ్యూస్, మోరిస్‌లపై అందరి దృష్టి నెలకొని ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications