న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: రిటైర్మెంట్‌పై స్పష్టమైన ప్రకటన చేసిన యువరాజ్ (వీడియో)

IPL 2019 : Yuvraj Singh Opens Up On His Retirement
IPL 2019: Yuvraj Singh Speaks About Retirement Plans, How Sachin Tendulkar Made Things Easier

హైదరాబాద్: ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం తాను రిటైర్మెంట్‌ గురించి ఆలోచించనని ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న యువరాజ్ సింగ్ వెల్లడించాడు. సమయం వచ్చినప్పుడు తానే క్రికెట్‌ నుంచి తప్పుకుంటానని యువరాజ్‌ సింగ్‌ స్పష్టంచేశాడు. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లో నిరాశపరుస్తోన్న యువరాజ్ తాజా సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరుపున చక్కటి ప్రదర్శన చేశాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో

ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం యువీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో విలేకరులు అతడి రిటైర్మెంట్‌కు సంబంధించిన ప్రశ్న వేశారు. ఆటపై ఇష్టం ఉన్నంత కాలం తాను క్రికెట్‌ ఆడుతానని యువరాజ్ సమాధానమిచ్చాడు.

రిటైర్మెంట్‌పై మాట్లాడిన యువీ

యువీ మాట్లాడుతూ "రిటైర్‌ అయ్యేందుకు తగిన సమయం వచ్చేసిందని భావించిన రోజున ఎవరూ చెప్పకుండానే అందరికంటే ముందుగా నేను ఆ పని చేస్తా. గత రెండేళ్లుగా చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థమయ్యేది కాదు. నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఒక దశలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు" అని అన్నాడు.

క్రికెట్‌ను ఎంతగా ఆస్వాదించానో

క్రికెట్‌ను ఎంతగా ఆస్వాదించానో

"నేను అండర్‌-16 ఆడేటప్పుడు క్రికెట్‌ను ఎంతగా ఆస్వాదించానో ఇప్పుడూ అలాగే ఉన్నాననిపించింది. అప్పటికీ నాకు జాతీయ జట్టులో అవకాశం రాలేదు. కానీ, ఆ సమయంలో ఆటను ఆస్వాదించాను కాబట్టి ఆడాను. కాబట్టి ఇప్పుడు కూడా ఆటను ఆస్వాదించినంత కాలం ఆడతా" అని యువరాజ్‌ స్పష్టం చేశాడు.

రిటైర్మెంట్ విషయంపై సచిన్‌తో మాట్లాడా

తన రిటైర్మెంట్ విషయంపై క్రికెట్‌ దిగ్గజం క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌తో మాట్లాడానని చెప్పాడు. తన వయసులోనే ఉన్న సమయంలో సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నాడని యువరాజ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. సచిన్‌తో మాట్లాడిన తర్వాత తనలో ఆందోళన తగ్గిందని కూడా యువరాజ్ వెల్లడించాడు.

గత సీజన్‌లో యువరాజ్ పేలవ ప్రదర్శన

గత సీజన్‌లో యువరాజ్ పేలవ ప్రదర్శన

కాగా గత ఐపీఎల్‌ సీజన్‌లో యువరాజ్ ఆశించినంత స్థాయిలో రాణించలేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో మొదట అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. రెండోసారి వేలంలో చివరికి ముంబై ఇండియన్స్‌ జట్టు అతడిని కనీస ధరకే కొనుగోలు చేసింది. దీంతో యువీ ఆడిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Story first published: Tuesday, March 26, 2019, 15:24 [IST]
Other articles published on Mar 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X