ఐపీఎల్ 2019: లీగ్ స్టేజి ఫైనల్ డే, నాలుగో ప్లేఆఫ్ బెర్తు ఏ జట్టుదో!

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లీగ్ దశ ఆదివారంతో పూర్తి కానుంది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాయి. ఇక, ప్లేఆఫ్‌కు చేరో నాలుగో జట్టు ఏదో ఆదివారం నాటి మ్యాచ్ ఫలితలాపై ఆధారపడింది. బెంగళూరు, రాజస్థాన్ ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
దీంతో నాలుగో ప్లేఆఫ్ బెర్తు కోసం కోల్‌కతా (12 పాయింట్లు), హైదరాబాద్ (12), పంజాబ్ (10) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టోర్నీలో భాగంగా ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. మొహాలి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

రాత్రి 8 గంటలకు ముంబై vs కోల్‌కతా
ఆ తర్వాత రాత్రి 8 గంటలకు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ చేరిన మూడు జట్లకు, చివరి బెర్తుకు పోటీలో ఉన్న మూడు జట్లకు ఆదివారం నాటి మ్యాచ్ ఫలితాలు కీలకం కానున్నాయి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో సన్‌రైజర్స్ మ్యాచ్ ప్లేఆఫ్‌కు చేరుతుందా లేదా అన్నది ముంబై-కోల్‌కతా మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఉంటుంది.

సన్ రైజర్స్ మెరుగైన రన్‌రేట్
ముంబైతో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా ఓడితేనే హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. ముంబైపై కోల్‌కతా గెలిస్తే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మెరుగైన రన్‌రేట్ (+0.577) ఉండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. ఒకవేళ చెన్నైపై పంజాబ్ గెలిచినా నెట్ రన్‌రేట్ (-0.351) బాగా తక్కువ ఉన్న నేపథ్యంలో సన్‌రైజర్స్ ముందంజ వేసే అవకాశం ఉంది.

టాప్-2లో ముగించిన జట్లకు ప్లేఆఫ్ దశలో
మరోవైపు లీగ్ దశలో టాప్-2లో ముగించిన జట్లకు ప్లేఆఫ్ దశలో ఒక మ్యాచ్ ఓడినా, ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. కాబట్టి కోల్‌కతాపై నెగ్గి టాప్-2లో చోటు సంపాదించాలనేది ముంబై లక్ష్యం. ఇప్పటికే ఆ జట్టు నెట్ రన్‌రేట్ (+0.321).. టాప్-2లో ఉన్న చెన్నై (+0.209), ఢిల్లీ క్యాపిటల్స్ (+0.044) కన్నా మెరుగ్గా ఉంది.

18 పాయింట్లతో చెన్నై అగ్రస్థానంలో
కాబట్టి ఆదివారం కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో ముంబై నెగ్గితే టాప్-2లో తప్పకుండా చోటు దక్కించుకుంటుంది. ప్రస్తుతం 18 పాయింట్లతో చెన్నై అగ్రస్థానంలో ఉంది. దీంతో పంజాబ్‌పై నెగ్గి 20 పాయింట్లతో లీగ్‌ను టాప్-1లో ముగించాలని చెన్నై లక్ష్యంగా పెట్టుకుంది. ఆదివారం ముంబై గెలిచి, చెన్నై ఎక్కువ తేడాతో ఓడిపోతే మూడో స్థానానికి పడిపోయే అవకాశం ఉంది.
1. CSK [13-9-4-0-18/+0.209]
2. DC [14-9-5-0-18/+0.044]
3. MI [13-8-5-0-16/+0.321]
4. SRH [14-6-8-0-12/+0.577]
5. KKR [13-6-7-0-12/+0.173]
6. RR [14-5-8-1-11/-0.449]
7. RCB [14-5-8-1-11/-0.607]
8. KXIP [13-5-8-0-10/-0.351]
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications