న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జాదవ్ ఎఫెక్: ధోనీ నాలుగులోనే: స్పష్టం చేసిన కోచ్ ఫ్లెమింగ్

IPL 2019 : MS Dhoni Will Mostly Bat At Number 4 Says Stephen Fleming | Oneindia Telugu
IPL 2019: With no India pacers in line-up, workload management will be minimal for CSK, insists Stephen Fleming

హైదరాబాద్: ఈ సీజన్‌లో కూడా చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగుతాడని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. గతేడాది ఇదే స్థానంలో ఆడిన ధోని జట్టుకు ఎన్నో విజయాలు అందించాడని ఈ సందర్భంగా ప్లెమింగ్ గుర్తు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో కూడా అతడిని నాలుగో స్థానంలోనే కొనసాగిస్తామని ఫ్లెమింగ్‌ తెలిపాడు. గత సీజన్‌లో కేదార్‌ జాదవ్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో మిడిలార్డర్‌ పూర్తి బాధ్యతను ధోనినే తీసుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కేదార్ జాదవ్‌ తిరిగి జట్టుతో చేరడంతో

కేదార్ జాదవ్‌ తిరిగి జట్టుతో చేరడంతో

కేదార్ జాదవ్‌ తిరిగి జట్టుతో చేరడంతో నాలుగో స్థానంపై సీఎస్‌కే జట్టులో సందిగ్దత నెలకొంది. దీంతో ఫ్లెమింగ్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. "గతేడాది జాదవ్ గాయంతో అందుబాటులో లేడు. ఆ సమయంలో ధోని మిడిలార్డర్‌లో ఆడి అద్భుత విజయాలను అందించాడు" అని ప్లెమింగ్ అన్నాడు.

ధోనీ స్థానంలో మార్పులేదు

ధోనీ స్థానంలో మార్పులేదు

"ఇప్పుడు జాదవ్ మళ్లీ అందుబాటులోకి వచ్చాడు. అయినా ధోనీ స్థానంలో మార్పులేదు. పరిస్థితులను బట్టి జాదవ్‌ను అటు ఇటు మార్చి ఆడిస్తాం. ఈ ఇద్దరు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థులు. గత పది నెలల నుంచి ధోని సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రత్యామ్నాయాలను బట్టి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తాం" అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.

ఆటగాళ్ల దృక్పథాన్ని బట్టి విజయాలు

ఆటగాళ్ల దృక్పథాన్ని బట్టి విజయాలు

వయసు పెరిగినా ఆటగాళ్ల దృక్పథాన్ని బట్టి విజయాలు ఆధారపడి ఉంటాయని ప్లెమింగ్ చెప్పాడు. ఇక, బలాబలాల విషయంలో ఓ జట్టును మరో జట్టుతో పోల్చడం తగదని ఫ్లెమింగ్‌ అభిప్రాయపడ్డాడు. "ప్రస్తుతం సీఎస్‌కే అన్ని విధాల బలంగా ఉంది. రైనా, ధోని, డుప్లెసిస్‌, వాట్సన్‌, జాదవ్‌, రాయుడులతో బ్యాటింగ్‌ దుర్బేద్యంగా ఉంది.

డ్వేన్‌ బ్రావో జట్టుకు అదనపు బలం

డ్వేన్‌ బ్రావో జట్టుకు అదనపు బలం

"హర్భజన్‌ సింగ్‌, కరణ్‌ శర్మ, తాహీర్‌, సాంట్నర్‌లతో స్పిన్‌ విభాగం బలంగా ఉంది. డ్వేన్‌ బ్రావో జట్టుకు అదనపు బలం. ఇప్పటికే సీఎస్‌కే తన వ్యూహాలను రచించింది. మొత్తంగా గతేడాది ఫలితాలను ఈసారి కూడా రాబడుతాం" అని ఫ్లెమింగ్ ధీమా వ్యక్తం చేశాడు. మార్చి 23న ధోని నాయకత్వంలోని సీఎస్‌కే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో తలపడనుంది.

Story first published: Thursday, March 21, 2019, 11:40 [IST]
Other articles published on Mar 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X