న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ట్వీట్‌: ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో స్టార్‌ ఫెర్ఫార్మర్‌ ఎవరు?

IPL 2019 : ICC Asks Tweeple 'Who's The Best Performer Of SRH vs DC Match' || Oneindia Telugu
IPl 2019: Who was the star performer in Delhi vs Hyderabad Eliminator Match

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్-12లో సీనియర్ ఆటగాళ్లు వార్నర్, బెయిరిస్టో, క్రిస్ గేల్, ఎంఎస్ ధోనీ, రసెల్, రోహిత్, ధావన్, తాహిర్, హర్భజన్, భువనేశ్వర్, షమీలు సత్తా చాటుతున్నారు. ఇక యువ ఆటగాళ్లు పాండ్యా, రబడ, పృథ్వీ షా, రిషబ్‌ పంత్‌, రషీద్‌ ఖాన్‌, కీమో పాల్‌, పూరన్ ఇలా చాలా మంది రాణిస్తున్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అయితే విశాఖ వేదికగా బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 21 సంవత్సరాలు, అంత కన్నా తక్కువ వయసున్న నలుగురు యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ఇందులో ముగ్గురు పృథ్వీ షా, రిషబ్‌ పంత్‌, కీమో పాల్‌లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడగా.. ఒకేఒక్కడు రషీద్‌ ఖాన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడాడు.

ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మొదటగా కీమో పాల్‌ తన కోటా 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో పృథ్వీ షా (56; 38 బంతుల్లో 6×4, 2×6) అర్ధ సెంచరీ చేయగా.. రిషబ్‌ పంత్‌ (49; 21 బంతుల్లో 2×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రషీద్‌ ఖాన్‌ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసాడు. ఇందులో ఒక మేడిన్‌ ఓవర్‌ కూడా ఉంది. నలుగురు కూడా అద్భుత ప్రదర్శన చేసి అందరిని ఆకట్టుకున్నారు. దీంతో ఐసీసీ కూడా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో స్టార్‌ ఫెర్ఫార్మర్‌ ఎవరు? అని ట్వీట్ చేసింది.

Story first published: Thursday, May 9, 2019, 16:30 [IST]
Other articles published on May 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X