

హైదరాబాద్: ఐపీఎల్ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరొందిన వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఆ జట్టులో చేరాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లకు చెందిన ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే తమ తమ జట్లలో చేరుతున్నారు. ఇందులో భాగంగా క్రిస్ గేల్ మంగళవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో చేరాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
క్రిస్ గేల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్యాంపులో చేరిన సందర్భంగా ఆ జట్టు యాజమాన్యం ఓ వీడియోని తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. "దేఖో.. వో ఆ గయా" అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఇక, క్రిస్ గేల్ 'యూనివర్స్ బాస్.. ఈజ్ బ్యాక్ అంటూ అరుస్తూ.. చప్పట్లతో తన హర్షాన్ని వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2018 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో క్రిస్ గేల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలిపెట్టడంతో చివరి నిమిషంలో కనీస ధరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గేల్‌ను సొంతం చేసుకుంది. మార్చి 23నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, ఆండ్రూ టై, మయాంక్ అగర్వాల్, అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, రవిచంద్రన్ అశ్విన్, మన్‌దీప్ సింగ్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: మార్కస్ హెన్రిక్యూస్ (రూ.1 కోటి), నికోలస్ పూరాన్ (రూ.4.2 కోట్లు), మహ్మద్ షమీ (రూ.4.8 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.25 లక్షలు), వరుణ్ చక్రవర్తి (రూ.8.40 కోట్లు), సామ్ కర్రాన్ (రూ.7.20 కోట్లు), హర్డస్ విల్జోయెన్ (రూ.75 లక్షలు), అర్షదీప్ సింగ్ (రూ.20 లక్షలు), దర్శన్ నాల్కండే (రూ.30 లక్షలు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ.4.8 కోట్లు), అగ్నివేశ్ అయాచీ (రూ. 20 లక్షలు), హర్‌ప్రీత్ బ్రార్ (రూ. 20 లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ. 20 లక్షలు).
ఐపీఎల్‌లో పంజాబ్ ఆడే మ్యాచ్ వివరాలివే!
March 25: vs RR (8 pm)
March 27: vs KKR (8 pm)
March 30: vs MI (4 pm)
April 1: vs DC (8 pm)
April 6: vs CSK (4 pm)
April 8: vs SRH (8 pm)
April 10: vs MI (8 pm)
April 13: vs RCB (8 pm)
April 16: vs RR (8 pm)
April 20: vs DC (8 pm)
April 24: vs RCB (8 pm)
April 29: vs SRH (8 pm)
May 3: vs KKR (8 pm)
May 5: vs CSK (4 pm)