న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: ఒంటి చేత్తో ఆండ్రీ రస్సెల్ సిక్స్‌ని ఆపిన జడేజా (వీడియో)

IPL 2019: WATCH - Ravindra Jadeja saves a six by putting an extraordinary effort on boundary

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో కోల్‌కతా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ కొట్టిన సిక్స్‌ను బౌండరీ లైన్ వద్ద రవీంద్ర జడేజా ఒంటి చేత్తో అడ్డుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. కోల్‌కతా ఓపెనర్లలో క్రిస్ లిన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరగా... మరో ఓపెనర్ సునీల్‌ నరైన్‌(6) కూడా నిరాశపరిచాడు. దీపక్‌ చాహర్‌ వేసిన తొలి ఓవర్‌లోనే క్రిస్ లిన్‌ ఎల్బీ రూపంలో ఔట్ కాగా, హర్భజన్‌ వేసిన రెండో ఓవర్‌లో సునీల్ నరైన్‌ ఔటయ్యాడు.

ఆండ్రీ రస్సెల్ ఒంటరి పోరాటం

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్‌ రాణాను ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. అటు తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్‌ ఊతప్ప(11), కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌(19)లు కూడా నిరాశపరిచారు. ఆండ్రీ రసెల్‌ 44 బంతుల్లో 50 నాటౌట్‌ (5 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రం ఒంటరి పోరాటం చేయడంతో వంద పరుగుల స్కోరుని దాటింది.

బౌండరీ లైన్ వద్ద అడ్డుకున్న జడేజా

ఈ క్రమంలో రస్సెల్ కొట్టిన బంతిని జడేజా బౌండరీ లైన్ వద్ద అడ్డుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జడేజా ప్రయత్నంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కోల్‌కతా నిర్దేశించింన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.

Story first published: Wednesday, April 10, 2019, 18:27 [IST]
Other articles published on Apr 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X