న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్నర్ వల్లే: ఐపీఎల్‌లో ఆడుతోన్న తొలి నేపాలీ క్రికెటర్ లమిచానె

IPL 2019 : Shane Warne Told Me To Bowl With Big And Brave Heart, Says Sandeep Lamichhane | Oneindia
IPL 2019: Warne told me to bowl with big and brave heart, says Lamichhane

హైదరాబాద్: ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ చెప్పిన సలహాలతోనే తాను ధైర్యంగా బంతులు విసరగలుతున్నానని నేపాల్ యువ స్పిన్నర్ సందీప్‌ లామిచానె తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతోన్న తొలి నేపాలీ క్రికెటర్ సందీప్‌ లామిచానె కావడం విశేషం. గత సీజన్‌లో సందీప్‌ లామిచానెని ఢిల్లీ డేర్‌డెవిల్స్ వేలంలో కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ప్రాతినిథ్యం వహించేందుకు భారత్‌కు వచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

షేన్‌వార్న్‌ను నేను ఆరాధిస్తా

షేన్‌వార్న్‌ను నేను ఆరాధిస్తా

ఈ సందర్భంగా సందీప్ లమిచానె మాట్లాడుతూ "షేన్‌వార్న్‌ను నేను ఆరాధిస్తా. ఆయన్నుంచి స్ఫూర్తి పొందుతా. అదృష్టవశాత్తు ఐపీఎల్‌లో ఆయనను కలుసుకొనే అవకాశం కల్పించింది. గతేడాది ఆయన్ను కలిసినప్పుడు నా బౌలింగ్‌ మెరుగుపరుచుకొనేందుకు విలువైన సలహాలిచ్చారు. నా కెరీర్‌ అద్భుతంగా సాగిపోయేందుకు అవి ఉపయోగపడ్డాయి" అని చెప్పాడు.

కష్టపడడమే నా విజయానికి కారణం

కష్టపడడమే నా విజయానికి కారణం

ఇక, పరిస్థితులను అదుపులో ఉంచుకోవడం, కష్టపడడం తన విజయానికి కారణమని సందీప్‌ అంటున్నాడు. ఈ ఏడాది జరిగిన బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో కూడా సందీప్ లమిచానె అద్భుత ప్రదర్శన చేశాడు. లీగులు ఆడి స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడంతో ఇబ్బంది కలుగుతుందని తెలిపాడు.

ప్రశాంతంగా ఉంటా

"అయితే ఎప్పుడు లీగుల్లో పాల్గొనే అవకాశం వచ్చినా ప్రశాంతంగా ఉంటా. నేపాల్‌లో సరైన మౌలిక వసతులు ఉండవు కాబట్టి బాగా కష్టపడాల్సి ఉంటుందని తెలుసు. నా కెరీర్‌లో ఐపీఎల్‌ 18 ఓ మధురస్మృతి. టెస్టులకు అర్హత సాధించని జట్ల ఆటగాళ్లకు ఇది మంచి వేదిక" అని లామిచానె ఈ సందర్భంగా తెలిపాడు.

Story first published: Friday, March 22, 2019, 9:38 [IST]
Other articles published on Mar 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X