Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్.. ఆన్‌లైన్‌లో ప్లేఆఫ్‌ టికెట్లు

IPL 2019 : IPL Fever Catching Up As Vizag All Set To Host Playoffs,Qualifier Tickets Now In Online !
IPL 2019: Vizag playoffs tickets available from Today

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌-12 చివరి దశకు చేరుకుంది. చెన్నై, ముంబై, ఢిల్లీ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరుకోగా.. మరో బెర్తు కోసం హైదరాబాద్, కలకత్తా, పంజాబ్ జట్లు పోటీ పడుతున్నాయి. అయితే హైదరాబాద్ జట్టుకే ప్లేఆఫ్‌ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మరో నాలుగు రోజుల్లో ప్లేఆఫ్‌ సమరానికి తెరలేవనుంది.

ఈ నెల 8, 10 తేదీల్లో విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ మైదానంలో ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. 8న ఎలిమినేటర్‌ మ్యాచ్‌.. 10న క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ జరుగుతాయి. ఈ మ్యాచ్‌ల టికెట్లు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నట్లు ఆంధ్ర క్రికెట్‌ సంఘం కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

బీసీసీఐ నిర్ణయించిన ప్రకారం రూ.500, రూ.1000, రూ.1500, రూ.1750, రూ.3,500, రూ.5,000, రూ.7,500, రూ.9,000 ధరల్లో టిక్కెట్లు లభ్యం కానున్నాయి. అయితే తొలి అంతస్తులోని కార్పొరేట్‌ బాక్స్‌లో ఒక్కో టికెట్‌ రూ. 9000కు, రెండో అంతస్తులోని కార్పొరేట్‌ బాక్స్‌లో ఒక్కో టికెట్‌ రూ. 5000కు లభిస్తాయి. టికెట్లు ‌www.eventsnow.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

Story first published: Friday, May 3, 2019, 10:56 [IST]
Other articles published on May 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+