కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్: అత్యుత్తమ ఐపీఎల్ జట్టుని ప్రకటించిన సెహ్వాగ్

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ తుది దశకు చేరుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఇలాంటి సమయంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అత్యుత్తమ ఐపీఎల్ జట్టును ప్రకటించాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
సెహ్వాగ్ ప్రకటించిన జట్టులో భారత మాజీ కెప్టెన్ ధోనితో పాటు ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మకు కూడా చోటు దక్కలేదు. ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లలో ఏ ఒక్క ఆటగాడికి సెహ్వాగ్ చోటు కల్పించలేదు. దీనిపై సెహ్వాగ్ వివరణ సైతం ఇచ్చాడు.

ఐపీఎల్ 12వ సీజన్ ప్రదర్శన ఆధారంగానే
క్రికెటర్ల గత రికార్డులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఐపీఎల్ 12వ సీజన్ ప్రదర్శన ఆధారంగానే జట్టుని ఎంపిక చేసినట్లు సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ ప్రకటించిన జట్టుకు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు.

ఓపెనర్లుగా వార్నర్, ధావన్
ఓపెనర్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ఎంపిక చేశాడు. ఈ సీజన్‌లో ధావన్ మొత్తం 16 మ్యాచ్‌లాడి 521 పరుగులు చేశాడు. ఇక, వార్నర్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

10 మ్యాచ్‌లాడి 445 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో
తన ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లోనే జానీ బెయిర్ స్టో చెలరేగాడు. సన్ రైజర్స్ తరుపున కేవలం 10 మ్యాచ్‌లాడి 445 పరుగులతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. నాలుగో స్థానానికి సెహ్వాగ్ కేఎల్ రాహుల్‌ని ఎంపిక చేశాడు. ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ మొత్తం 14 మ్యాచ్‌లాడి 593 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

మిడిలార్డర్‌లో రిషభ్ పంత్, ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా
ఇక, మిడిలార్డర్‌లో రిషభ్ పంత్, ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నారని సెహ్వాగ్ పేర్కొన్నాడు. బౌలింగ్ విభాగంలో అత్యుత్తమ బౌలర్లుగా బుమ్రా, రబాడా రాణిస్తున్నారని అందుకే వాళ్లను తీసుకున్నానని చెప్పాడు. యువ స్పిన్నర్లు రాహుల్ చాహర్, శ్రేయస్ గోపాల్ ఈ ఏడాది బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని అన్నాడు.

అమితంగా ఆకట్టుకున్న ఆటగాడు రిషబ్ పంతే
ఈ ఏడాది తనను అమితంగా ఆకట్టుకున్న ఆటగాడు మాత్రం రిషభ్ పంతేనని సెహ్వాగ్ ప్రకటించాడు. కోహ్లీ, డివిలియర్స్‌ను ఎందుకు తీసుకోలేదంటే.. వాళ్లిద్దరూ ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు అందుకే వాళ్లను పక్కన పెట్టానని అన్నాడు. మొత్తంగా సెహ్వాగ్ జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు, నలుగురు ఓపెనర్ బ్యాట్స్‌మెన్, ఇద్దరు ఆల్ రౌండర్లు, ఇద్దరు ప్రధాన పేస్లరు, ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.

సెహ్వాగ్ ప్రకటించిన 2019 ఉత్తమ ఐపీఎల్ జట్టిదే
డేవిడ్ వార్నర్(కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అండ్రూ రసెల్, శ్రేయస్ గోపాల్, రాహుల్ చాహర్, కగిసో రబాడా, జస్ప్రీత్ బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications