Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు: 2వ ఆటగాడిగా కోహ్లీ, ప్రశంసల వర్షం

IPL 2019: Virat Kohli slams fifth IPL ton: Cricketing fraternity hails King Kohli

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 58 బంతుల్లో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది 5వ సెంచరీ. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ 6 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సత్తాచాటి ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా నిలిపిన కెప్టెన్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ తన అద్భుత ఆటతీరుతో ఈడెన్‌లోని ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది.

అనంతరం ఆర్సీబీ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది రెండో విజయం కావడం విశేషం.

Story first published: Saturday, April 20, 2019, 17:49 [IST]
Other articles published on Apr 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+