న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నన్నే మన్కడింగ్ చేస్తావా!: సునీల్ నరేన్‌ను ఆటపట్టించిన కోహ్లీ (వీడియో)

IPL 2019 : Kohli Funny Reaction When Sunil Narine Stops His Bowling || Oneindia Telugu
IPL 2019: Virat Kohli Pretends to Avoid Mankad by Narine in Hilarious Fashion

హైదరాబాద్: మన్కడింగ్‌.. ఈ ఐపీల్‌ సీజన్‌లో ఎక్కువగా చర్చనీయాంశమైన పదం. ఈ సీజన్ ఆరంభంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ ద్వారా రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్ జోస్ బట్లర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఈ మన్కడింగ్ రనౌట్‌పై పెద్ద చర్చే జరిగింది. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడం ఇదే తొలిసారి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

క్రికెట్ నిబంధనలకు లోబడే

క్రికెట్ నిబంధనలకు లోబడే

క్రికెట్ నిబంధనలకు లోబడే అశ్విన్ రనౌట్ చేశాడని కొందరు భావిస్తుండగా... మరికొందరు మాత్రం అశ్విన్ తీరు అనైతికంగా ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే, తాజాగా శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ మన్కడింగ్‌పై సరదా సంఘటన చోటు చేసుకుంది.

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌‌‌లో

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌‌ను కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరేన్ వేశాడు. ఈ ఓవర్‌ చివరి బంతిని వేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చిన నరేన్‌ బంతిని వేయకుండానే పిచ్ మధ్యలో ఆగిపోయాడు. అదే సమయంలో నాన్‌ స్ట్రయికింగ్‌లో కోహ్లీ ఉన్నాడు. నరైన్‌ మన్కడింగ్‌ చేసేందుకు ప్రయత్నించనప్పటికీ కోహ్లీ వెంటనే బ్యాట్‌ను క్రీజులో పెట్టాడు.

మోకాళ్లపై కూర్చుని బ్యాట్‌ను క్రీజులో పెడుతూ

అంతేకాదు మోకాళ్లపై కూర్చుని బ్యాట్‌ను క్రీజులో పెడుతూ ఇప్పుడు నన్నే మన్కడింగ్ చేస్తావా అంటూ నరైన్‌ను ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

10 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం

10 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం

214 పరుగుల భారీ​ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది 5వ సెంచరీ కావడం గమనార్హం.

Story first published: Saturday, April 20, 2019, 15:00 [IST]
Other articles published on Apr 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X