ఐపీఎల్ 2019: కెప్టెన్ల జాబితాలో ధోని, గంభీర్‌ల సరసన విరాట్ కోహ్లీ

హైదరాబాద్: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా 100వ మ్యాచ్ కావడం విశేషం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ... మహేంద్ర సింగ్ ధోని, గౌతమ్ గంభీర్ సరసన చేరాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన మూడో ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన ఆటగాళ్లు వీరే...

ధోని
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహారించిన ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ధోనీ, అత్యధికంగా మొత్తం 162 ఐపీఎల్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహారించాడు.

గౌతమ్ గంభీర్
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహారించిన ఆటగాళ్ల జాబితాలో గౌతమ్ గంభీర్ రెండోస్థానం ఉన్నాడు. గౌతమ్ గంభీర్ 129 ఐపీఎల్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహారించాడు.
విరాట్ కోహ్లీ
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహారించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఆర్సీసీ తరుపున 100వ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

రోహిత్ శర్మ
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన ఆటగాళ్ల జాబితాలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మది నాలుగో స్థానం. మొత్తం 94 మ్యాచ్‌లకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications