ఐపీఎల్ 2019: విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు

హైదరాబాద్: టీ20 మ్యాచ్‌ల్లో జట్టు విజయం సాధించాలంటే ఫీల్డింగ్ ఎంతో ముఖ్యం. ఓ అద్భుతమైన క్యాచ్ లేదా నేలపాలైన క్యాచ్ మ్యాచ్ గమనాన్నే మార్చేసిందనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా ఆఖరి నిమిషంలో మ్యాచ్‌లను చేజార్చుకున్న జట్లను ఎన్నో చూశాం. ఒక్కసారి ఆదే ఫీల్ఢింగ్ మ్యాచ్‌ను తారుమారు చేస్తుంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2019 సీజన్‌లో ఫీల్డింగ్ అనేది అంతగొప్పగా లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఫీల్డింగ్‌లో కోహ్లీ చెత్త రికార్డు
ముఖ్యంగా ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌లో ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఆరు క్యాచ్‌లకు గాను నాలుగు క్యాచ్‌లను నేలపాలు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ క్యాచ్‌ల విజయశాతం 33గా నమోదైంది.

ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి
ఈ సీజన్ ఆరంభంలో ఆర్సీబీ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడడానికి ఇది కూడా ఓ కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోప్రా ఆర్చర్ మూడు క్యాచ్‌లను నేలపాలు చేశాడు.

రెండు క్యాచ్‌లను నేలపాలు చేసిన పఠాన్
ఇక, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యూసప్ ఫఠాన్ ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లకు గాను ఆరు ఇన్నింగ్స్‌ల్లో 32 పరుగులు చేశాడు. ఈ ఆరు ఇన్నింగ్స్‌ల్లో పఠాన్ రెండు క్యాచ్‌లను నేలపాలు చేశాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఢిల్లీ తరుపున అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం ఫీల్డింగ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చాడు. శిఖర్ ధావన్‌కు మూడు ఛాన్స్‌లు రాగా అందులో ఒక క్యాచ్‌ని నేలపాలు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications