న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: నీ కెప్టెన్‌నే స్లెడ్జ్ చేస్తావా?: బుమ్రాతో కోహ్లీ (వీడియో)

IPL 2019 : Virat Kohli Asked To Bumrah ‘Apne Captain Ko Sledge Karega’ | Oneindia Telugu
IPL 2019: Virat Kohli happy to see Jasprit Bumrah finally learnt the art of sledging

హైదరాబాద్: ఎట్టకేలకు టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్లెడ్జింగ్ చేయడం నేర్చుకున్నాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉంటూ అవకాశం దొరికితే ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను స్లెడ్జింగ్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియోలో విరాట్ కోహ్లీని బుమ్రా స్లెడ్జింగ్ చేయడం ఆశ్చర్యాన్ని గురి చేసింది.

India vs Australia: రెండు టీ20ల సిరిస్‌లో నమోదైన గణాంకాలివేIndia vs Australia: రెండు టీ20ల సిరిస్‌లో నమోదైన గణాంకాలివే

స్టార్ స్పోర్ట్స్ ట్విట్టర్‌లో వీడియో

ఐపీఎల్ 2019 సీజన్ ప్రమోషన్‌లో భాగంగా ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోని తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో చాలా కామ్‌గా ఉంటూ తన పదునైన బంతులతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పుట్టించే బుమ్రా... ఈ వీడియోలో విరాట్ కోహ్లీని స్లెడ్జ్ చేస్తాడు. ఐపీఎల్‌లో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

కోహ్లీకి సవాల్ విసిరిన బుమ్రా

కోహ్లీకి సవాల్ విసిరిన బుమ్రా

స్టార్స్ స్పోర్ట్స్ తన ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో ముంబై బౌలర్ బుమ్రా.. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసురుతాడు. స్టేడియంలో వరల్డ్ బెస్ట్ బౌలర్ అనే పోస్టర్‌ని చూసిన బుమ్రా "ఇంకా కాదు, వరల్డ్‌లో బెస్ట్ బ్యాట్స్ మెన్‌ వికెట్‌ను ఇంకా తీయలేదు. చీకూ భాయ్(కోహ్లీ), నేను వస్తున్నా, ఈసారి నువ్వు మా టీమ్‌లో లేవు" అని బుమ్రా అంటాడు.

నీ కెప్టెన్‌నే స్లెడ్జ్ చేస్తావా?

నీ కెప్టెన్‌నే స్లెడ్జ్ చేస్తావా?

బుమ్రా వ్యాఖ్యలపై కోహ్లీ "నీ కెప్టెన్‌నే స్లెడ్జ్ చేస్తావా?" అని అంటాడు. ఆ తర్వాత ప్లేట్‌లో సలాడ్‌ని ఫోర్క్‌తో తీసుకున్న కోహ్లీ నవ్వుతూ "బాగుంది, ఎట్టకేలకు స్లెడ్జింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నావ్?" అని అంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది.

ఐపీఎల్ 2019 షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ 2019 షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ 2019 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే బీసీసీఐ విడుదల చేసింది. అయితే, కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించడం విశేషం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేసింది. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

తొలి మ్యాచ్ ఆర్సీబీ-చెన్నై జట్ల మధ్య

తొలి మ్యాచ్ ఆర్సీబీ-చెన్నై జట్ల మధ్య

మార్చి 23న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ-చెన్నై జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ని మార్చి 24న ఢిల్లీతో తలపడనుంది. 14 రోజుల షెడ్యూల్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలోని ఎనిమిది జట్లూ నాలుగేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో రెండు మ్యాచ్‌లు సొంతగడ్డపై మిగిలిన రెండు ప్రత్యర్థి మైదానంలో ఆడనున్నాయి. కాగా బెంగళూరు, ఢిల్లీ జట్లు మాత్రం ఐదేసి మ్యాచ్‌‌లు ఆడనుండగా సొంతగడ్డపైనే మూడు మ్యాచ్‌లు ఆడేలా షెడ్యూల్‌‌ని విడుదల చేశారు.

Story first published: Thursday, February 28, 2019, 16:11 [IST]
Other articles published on Feb 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X