ఐపీఎల్: తొలి విజయం.. తొలి జరిమానా

ఈ ఐపీఎల్ సీజన్-12లో ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బోణీ కొట్టింది. సీజన్-12లో ఆడిన 7 మ్యాచ్‌లలో.. ఆరు వరుస పరాజయాల తర్వాత తొలి విజయంను నమోదు చేసింది. దీంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందంలో మునిగితేలాడు. అయితే ఆ ఆనందం మాత్రం ఎక్కువ సేపు నిలవలేదు. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా కెప్టెన్ కోహ్లీకి జరిమానా పడింది.

రూ.12లక్షలు జరిమానా:
శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీకి రూ.12లక్షలు జరిమానా పడింది. దీంతో ఈ సీజన్‌లో బెంగళూరు కెప్టెన్ కోహ్లీకి తొలి విజయంతో పాటు తొలి జరిమానా కూడా పడింది. ఈ సీజన్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను బెంగళూరు జట్టు ఉల్లంఘించడం ఇదే తొలిసారి.

రోహిత్, రహానేలకు కూడా:
ఇంతకు ముందు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ ఫీజులో కూడా కోత పడింది. ముంబయి ఇండియన్స్- కింగ్స్‌లెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. ముంబయి జట్టు స్లో ఓవర్ రేట్ నమోదుచేయడంతో రోహిత్‌కు జరిమానా పడింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానేకు జరిమానా పడింది.

కోహ్లీ, డివిలియర్స్ అర్ధ సెంచరీలు:
శనివారంరాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్ 99 నాటౌట్ (64 బంతుల్లో; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేసాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 67 (53 బంతుల్లో; 8 ఫోర్లు), ఏబీ డివిలియర్స్ 59 నాటౌట్ (38 బంతుల్లో; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications