న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మలింగ నోబాల్‌ వివాదంపై మ్యాచ్‌ రెఫరీని తీవ్ర పదజాలంతో దూషించిన కోహ్లీ!

IPL 2019 : Virat Kohli Argue With Match Referee After No-Ball Incident | Oneindia Telugu
IPL 2019: Virat Kohli abused match referee after umpiring error denied RCB win against MI: Reports

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో బెంగళూరు విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు అవసరమవగా.. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ నోబాల్ విసిరిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మలింగ నోబాల్‌గా విసిరినా పసిగట్టలేని ఫీల్డ్ అంపైర్

మలింగ నోబాల్‌గా విసిరినా పసిగట్టలేని ఫీల్డ్ అంపైర్

మలింగ నోబాల్‌గా విసిరినా ఫీల్డ్ అంపైర్ పసిగట్టలేకపోయాడు. దీంతో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ ముగిశాక రీప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది. అంపైర్ల పొరపాటును బిగ్‌స్క్రీన్‌పై చూసిన కోహ్లీ.. ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. ప్రజంటేషన్‌ సమయంలో అంపైర్ల తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మ్యాచ్ రిఫరీ రూమ్‌లోకి దూసుకెళ్లిన కోహ్లీ

అంతకముందు బెంగళూరు డగౌట్‌‌లో అప్పటి వరకూ కూర్చుని ఉన్న కోహ్లీ.. నోబాల్ సీన్ చూసిన తర్వాత కోపంతో స్టేడియంలో ఉన్న మ్యాచ్ రిఫరీ రూమ్‌లోకి దూసుకెళ్లాడు. అక్కడ ఉన్న మ్యాచ్ రిఫరీ మను నాయర్‌తో వాగ్వాదానికి దిగుతూ ‘నోబాల్‌పై ఫీల్డ్ అంపైర్లని ఎందుకు హెచ్చరించలేదు' అని తీవ్ర పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది.

ప్రవర్తనా నియమావళి కింద తనపై చర్యలు

ప్రవర్తనా నియమావళి కింద తనపై చర్యలు

అయితే ఇందుకు ప్రవర్తనా నియమావళి కింద తనపై చర్యలు తీసుకున్నా పట్టించుకోనని కోహ్లీ పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా తెలిపింది. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ క్రికెటర్‌ ఇలా మ్యాచ్ రిఫరీ రూమ్‌లోకి వెళ్లి.. వాదించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, రిఫరీ నిర్ణయాల్ని విభేదించడం, వాగ్వాదానికి దిగడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది.

కోహ్లీకి మందలింపు లేదా జరిమానా పడే అవకాశం

కోహ్లీకి మందలింపు లేదా జరిమానా పడే అవకాశం

ఈ నేపథ్యంలో కోహ్లీకి మందలింపు లేదా జరిమానా పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ప్రజంటేషన్‌ సమయంలో కోహ్లీ మాట్లాడుతూ "మేం ఆడేది ఐపీఎల్.. క్లబ్‌ స్థాయి క్రికెట్‌ కాదు. అంపైర్లు దీన్ని గమనించాల్సి ఉంది. ఉత్కంఠపోరులో ఇలాంటి తప్పిదాలు మంచిది కాదు. ఏకంగా అంగుళం తేడాతో అడుగు పడింది. అంపైర్లు ఏమైనా కళ్లు మూసుకున్నారా! ఇలాంటి చిన్న విషయాలే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి." అని అన్నాడు.

Story first published: Saturday, March 30, 2019, 14:06 [IST]
Other articles published on Mar 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X