ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి: ‘మన్కడింగ్’ ఔట్‌ను సమర్ధించుకున్న అశ్విన్

హైదరాబాద్: మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం లేదని ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్ ' ఔట్ విషయంలో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ అనైతికంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో అశ్విన్ తీరుపై నెటిజన్ల మండిపడుతున్నారు. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడం ఇదే తొలిసారి. మ్యాచ్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ "మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయింది. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే బట్లర్ క్రీజు వదిలాడు" అని అన్నాడు.

నేను స్పష్టంగా ఉన్నా
"అంతకుముందు కూడా ఇది గమనించాను. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. నేను బౌలింగ్ చేసేందుకు వస్తుంటే అతడు కనీసం నన్ను చూడలేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్ జాగరూకతతో ఉండటం అవసరం" అని అశ్విన్ తెలిపాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన జరిగింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం 185 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుని ఓపెనర్ జోస్ బట్లర్ (69: 43 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో మెరుగైన స్థితిలో నిలిపాడు. ఆ జట్టు విజయానికి 48 బంతుల్లో 80 పరుగులు అవసరమైన దశలో అశ్విన్ బౌలింగ్‌కి వచ్చాడు.

అశ్విన్ బంతి వేయడానికి ముందే
అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజ్ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. ఇదే అదనుగా బౌలింగ్‌ని నిలిపివేసిన అశ్విన్ వెనక్కి వచ్చి బెయిల్స్ అప్పీల్ చేశాడు. ఆఖరి క్షణంలో బౌలింగ్‌ని నిలిపివేసి రనౌట్‌కి ప్రయత్నించడం నైతికత కాదని.. జోస్ బట్లర్‌తో సహా మ్యాచ్ కామెంటేటర్లు సైతం అభిప్రాయపడ్డారు.
థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గా
అయితే, థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. కానీ.. అశ్విన్ అనైతికతంగా వ్యవహరించాడని కాసేపు మైదానంలో గొడవచేసిన బట్లర్.. తిట్టుకుంటూనే పెవిలియన్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అశ్విన్ ఇలా చేయాల్సింది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాజస్థాన్ కోచ్ ప్యాడీ మీడియాతో మాట్లాడుతూ
ఈ వివాదంపై మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్ ప్యాడీ మీడియాతో మాట్లాడుతూ "మేం బ్యాటింగ్ చేస్తున్నంతసేపూ గెలుపుపై ధీమాతో ఉన్నాం. రనౌట్ అనంతరం మా ఆటగాళ్లు కోలుకొని ఆడతారనుకున్నా. మర్యాదగా ప్రవర్తించి వారు హుందాతనం ప్రదర్శించారు. అది నాకెంతో నచ్చింది. ఈ విషయంపై మేం స్పందించం" అని అన్నారు.
ఐపీఎల్, క్రికెట్ అభిమానులకే వదిలేస్తున్నాం
"దానిని ఐపీఎల్, క్రికెట్ అభిమానులకే వదిలేస్తున్నాం. క్రికెట్ అభిమానులను ఉత్సాహ పరిచేందుకే మేము ఇక్కడ ఆడుతున్నాం. ఆటను ఆస్వాదించే వారికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాం" అని అన్నాడు. మన్కడింగ్ చట్టబద్ధతపై తాను లోతుగా పరిశీలిస్తానని.. ఈ విషయంపై అన్ని జట్లూ లోతుగా ఆలోచిస్తాయని ప్యాడీ ఈ సందర్భంగా వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications