13 బంతుల్లో 48 పరుగులు: రసెల్‌ను ‘బాహుబలి’తో పోల్చిన షారూక్

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. చినస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

153 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కేకేఆర్
బెంగళూరు బౌలర్లను చితకబాది కేకేఆర్‌కు విజయాన్ని అందించాడు. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒకానొక దశలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ విజయానికి చివరి 18 బంతుల్లో 53 పరుగులు చేయాలి. దీంతో అంతా ఆర్సీబీ విజయం సాధిస్తుందని భావించారు.

సిరాజ్ బౌలింగ్‌లో సిక్స్
ఈ క్రమంలో సిరాజ్ బౌలింగ్‌కు వచ్చాడు. రెండు బంతులు వేశాడు. అందులో ఓ నోబాల్ దానిని రస్సెల్ సిక్సర్‌గా మలిచాడు. మిగిలిన నాలుగు బంతులు వేసిన స్టోయినిస్ రెండు సిక్సర్లు సమర్పించుకున్నాడు. దీంతో కేకేఆర్ విజయసమీకరణం 12 బంతుల్లో 30 పరుగులుగా మారింది.

ఆర్సీబీనే విజయం అనుకున్నారంతా!
ఈ దశలోనూ ఆర్సీబీనే విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే, టిమ్ సౌథీ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 4, 6తో 29 పరుగులు రాబట్టి విజయాన్ని అందించాడు. ఓడిపోతుందని అనుకున్న మ్యాచ్‌ని ఒంటిచేత్తో గెలిపించాడు. మ్యాచ్ అనంతరం కేకేఆర్ యజమాని, బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్, రెస్సెల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

రసెల్‌ను ‘బాహుబలి’తో పోల్చిన షారూక్ ఖాన్
ఆండ్రీ రసెల్‌ను ‘బాహుబలి'తో పోల్చాడు. అంతేకాదు ‘బాహుబలి' ప్రభాస్ క్యారెక్టర్‌లో రెసెల్ ఫొటో మార్ఫ్ చేసి షారూక్ ట్వీట్ చేశారు. "కేకేఆర్ ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. జట్టులో ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రదర్శన చేశారు. అయితే ఈ ఒక్క ఫొటో(రసెల్ బాహుబాలి ఫొటోను ఉద్దేశిస్తూ) ముందు ఎన్ని ప్రశంసలైనా దిగదుడుపే అని మీరంతా అంగీకరించాల్సిందే" అని ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications