Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్‌ లేని ఢిల్లీ ఎప్పటికీ ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గదు: ట్విట్టర్‌లో ఫ్యాన్స్

 IPL 2019: Twitter abuzz as fans react strongly to Gautam Gambhir being released

హైదరాబాద్: ఐపీఎల్ 2019 కోసం డిసెంబర్ నెలలో వేలం నిర్వహించనున్నారు. దీంతో వచ్చే సీజన్ కోసం ఫ్రాంఛైజీలు ఇప్పటి నుంచే తమ కసరత్తులను ముమ్మరం చేసాయి. ఇందులో భాగంగా అవసరం లేని ఆటగాళ్లను వదులుకుంటూ ప్రాంఛైజీలు తమ భారాన్ని తగ్గించుకుంటున్నాయి.

గత ఐపీఎల్ కోసం వేలంలో అత్యధిక ధర పెట్టి కొనుక్కున్న స్టార్‌ క్రికెటర్లను, ఫామ్‌లో లేని ఆటగాళ్లందరినీ వదులుకుంటున్నాయి. ఇప్పటికే కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ జట్టు యువరాజ్‌ సింగ్‌ను వదులుకోగా.. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ కెప్టెన్‌ గౌతమ్ గంభీర్‌తో సహా 10 మంది ఆటగాళ్లను వేలానికి విడుదల చేసింది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత ఆటగాళ్లు మహ్మద్‌ షమీ, సయాన్‌ గోష్‌, గురక్రిత్‌ సింగ్‌, నమాన్‌ ఓజా ఉండగా విదేశీ ఆటగాళ్లలో జాసన్‌ రాయ్‌, జూనియర్‌ డాలా, లియామ్‌ ప్లంకెట్‌, డానియల్‌ క్రిస్టియన్‌, గ్లేన్‌ మాక్స్‌వెల్‌లు ఉన్నారు. ఇక, అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో పంత్‌, అయ్యర్‌, పృథ్వీషాతో సహా 14 మంది ఉన్నారు.

ఢిల్లీ కోసం వస్తే వదులుకుంటారా?

ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టును రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన గౌతమ్ గంభీర్‌ను వదులుకోవడంపై అభిమానులు ఢిల్లీ ఫ్రాంఛైజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా కోల్‌కతాకు రెండు సార్లు టైటిల్‌ అందించిన గంభీర్‌.. ఢిల్లీ కోసం వస్తే వదులుకుంటారా? అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

గంభీర్‌ లేని ఢిల్లీ జన్మలో ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గదు

గంభీర్‌ లేని ఢిల్లీ జన్మలో ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గదని, ఇదో పిచ్చి నిర్ణయం అంటూ మరొక నెటిజన్ కామెంట్‌ పోస్టు చేశాడు. గతేడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో గంభీర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ రూ. 2.80 కోట్లకు కొనుగోలు చేసింది. కోల్‌కతా జట్టుని రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలబెట్టడంతో పాటు టీ20ల్లో ఫామ్‌ను చూసి ఢిల్లీ ఫ్రాంఛైజీ గంభీర్‌ను జట్టు కెప్టెన్‌గా కూడా ప్రకటించింది.

గంభీర్‌పై ప్రాంఛైజీ ఎన్నో ఆశలు పెట్టుకోగా

గంభీర్‌పై ప్రాంఛైజీ ఎన్నో ఆశలు పెట్టుకోగా

గత సీజన్‌లో గంభీర్‌పై ప్రాంఛైజీ ఎన్నో ఆశలు పెట్టుకోగా.. ఆ ఆశలను గంభీర్ వమ్ము చేశాడు. దీంతో సీజన్ మధ్యలోనే గంభీర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. గత సీజన్‌లో గంభీర్ అటు అభిమానులతో పాటు ఫ్రాంఛైజీని పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లాడిన గంభీర్ కేవలం 85 పరుగులు చేశాడు.

గత సీజన్‌లో 6 మ్యాచ్‌లాడి 85 పరుగులు చేసిన గంభీర్

గత సీజన్‌లో 6 మ్యాచ్‌లాడి 85 పరుగులు చేసిన గంభీర్

గత సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్.. పంజాబ్‌‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన గంభీర్ ఆ తర్వాత ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో గత సీజన్‌లో మొత్తం 6 మ్యాచ్‌లాడిన గంభీర్ చేసింది కేవలం 85 పరుగులు మాత్రమే. ఆ తర్వాత గంభీర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కి ప్రాంఛైజీ పగ్గాలు అప్పగించింది.

Story first published: Friday, November 16, 2018, 15:19 [IST]
Other articles published on Nov 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+