For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షేన్‌ వాట్సన్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ చేజారిపోయింది: భువనేశ్వర్‌ కుమార్‌

IPL 2019: The way Watson batted we couldnt really do much says Bhuvneshwar Kumar

చెన్నై సూపర్‌ కింగ్స్‌ డాషింగ్ ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ చేజారిపోయింది అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం రాత్రి చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. వాట్సన్‌ 96 (53 బంతుల్లో 9ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి చెన్నై జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

వాట్సన్‌ను ఆపలేకపోయాం:

వాట్సన్‌ను ఆపలేకపోయాం:

మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మాట్లాడుతూ... '176 పరుగుల లక్ష్యం ఈ వికెట్‌పై ఛేదించడం సులువే. మేము బౌలింగ్‌ సమయంలోనూ కొంచెం మంచు కురిసింది. అయితే దాని వల్ల ఎటువంటి ఇబ్బంది కలగలేదు. షేన్‌ వాట్సన్‌ అద్భుతంగా ఆడాడు. అతన్ని మేము ఆపలేకపోయాం. ఆసమయంలో ఎవరు బౌలింగ్ చేసినా పరుగులు ఇచ్చారు. వాట్సన్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ చేజారిపోయింది' అని భువీ తెలిపారు.

రషీద్‌కు ఇదే తొలిసారి:

రషీద్‌కు ఇదే తొలిసారి:

'గత మూడేళ్లలో ఇన్ని పరుగులు ఇవ్వడం రషీద్‌కు ఇదే తొలిసారి. ఏ బౌలర్‌కైనా ఇలాంటి రోజు వస్తుంది. వాట్సన్‌ చెలరేగడంతోనే రషీద్‌ ఇన్ని పరుగులు ఇచ్చాడు. వచ్చే మ్యాచ్‌లో బెయిర్‌స్టో జట్టుకు అందుబాటులో ఉండడు. ఇది పెద్ద లోటు. అయితే బెయిర్‌స్టోను భర్తీచేయగల ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. వారు రాణించగలరన్న నమ్మకం ఉంది' అని భువీ ఆశాభావం వ్యక్తం చేశారు.

మూడింట్లో గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకుంటాం:

మూడింట్లో గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకుంటాం:

'మాకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నాయి. అందులో మూడు మ్యాచ్‌లు బయటి మైదానాల్లో ఆడాల్సి ఉంది. నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకుంటాం. రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో రాణిస్తాం. కెప్టెన్‌గా ఈ సీజన్‌లో ఏంతో నేర్చుకున్నా' అని భువీ చెప్పుకొచ్చారు.

 వాట్సన్‌ దాడి:

వాట్సన్‌ దాడి:

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-12 సీజన్‌లో ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖరారు చేసుకునట్టే. మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (49 బంతుల్లో 83 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), వార్నర్‌ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వాట్సన్‌ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రైనా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్‌) పర్వాలేదనిపించాడు.

Story first published: Wednesday, April 24, 2019, 13:39 [IST]
Other articles published on Apr 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+