న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: 7 బంతుల్లో 17 పరుగులు, పొలార్డ్ ఫామ్‌లోకి వచ్చినట్టేనా?

IPL 2019 : Kieron Pollard Sensational Catch During Chennai Super Kings Vs Mumbai Indians | Oneindia
IPL 2019: The curious case of MI Batsman Kieron Pollard

హైదరాబాద్: ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్లలో కీరన్ పొలార్డ్ ఒకడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ ఆల్‌రౌండర్‌ ఎన్నో సార్లు ఒంటిచేత్తో విజయాలనందించాడు. గత సీజన్లలో ముంబై ఇండియన్స్ గెలిచిన మ్యాచ్‌ల్లో పొలార్డ్ పాత్ర తప్పకుండా ఉండేది. అయితే, ఈ మధ్య కాలంలో పొలార్డ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

దీంతో అభిమానులు సైతం పొలార్డ్ పని అయిపోయిందని అనుకునే సమయంలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 17 పరుగులు చేసిన పొలార్డ్‌ ఒక కళ్లు చెదిరే క్యాచ్‌ సైతం అందుకున్నాడు.

2010లో జరిగిన వేలంలో రూ. 7.50 కోట్లు చెల్లించి ముంబై ఇండియన్స్ యాజమాన్యం సొంతం చేసుకుంది. అప్పటి నుంచి పొలార్డ్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం వదులుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఐపీఎల్ 2009 సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన పొలార్డ్ 217 పరుగులు చేశాడు. ఆ తర్వాతి సీజన్‌లో 17 మ్యాచ్‌లాడిన పొలార్డ్ 385 పరుగులు చేశాడు.

గత సీజన్‌లో మొత్తం 9 మ్యాచ్‌లాడిన పొలార్డ్ 133 పరుగులతో పేలవ ప్రదర్శన చేశాడు. పొలార్డ్ కూడా ముంబై యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. ఈ సీజన్‌లో ముంబై ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఆడిన పొలార్డ్‌ కేవలం 50 పరుగులు మాత్రమే. అయితే, బుధవారం నాటి మ్యాచ్‌లో పొలార్డ్ ఫామ్‌లోకి రావడంతో ఆ జట్టు యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.

Story first published: Thursday, April 4, 2019, 16:18 [IST]
Other articles published on Apr 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X