Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2019: ఆర్సీబీ బౌలర్లకు ధోని హెచ్చరిక: స్టేడియం వెలుపలికి బంతి (వీడియో)

IPL 2019 : MS Dhoni Shots Ball On Stadium Roof During Practice Session | Oneindia Telugu
IPL 2019: Thala MS Dhoni hits ball on stadium roof in practice session for CSK – Watch Video

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌‌కి మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. శనివారం రాత్రి 8 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లకి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గట్టి హెచ్చరికలు పంపాడు. తొలి మ్యాచ్‌కి ముందు శుక్రవారం నెట్ ప్రాక్టీస్‌ చేసిన ధోని బంతిని ఏకంగా స్టేడియం వెలుపలికి తరలించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎడమచేతి వాటం స్పిన్నర్ విసిరిన బంతిని.. క్రీజు వెలుపలికి వచ్చిన ధోనీ లాంగాన్ దిశగా హిట్ చేశాడు. బ్యాట్‌కి మిడిల్ అయిన బంతి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ స్టేడియం వెలుపలికి వెళ్లిపోయింది. గత ఏడాది పేలవ ఫామ్‌తో నిరాశపరిచిన ధోనీ.. ఈ ఏడాది ఆరంభం నుంచి సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

తొలి మ్యాచ్‌లో జట్ల అంచనా:
చెన్నై సూపర్ కింగ్స్:
షేన్ వాట్సన్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), కేదార్ జాదవ్, బిల్లింగ్స్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శాంట్నర్, శార్ధూల్ ఠాకూర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సిమ్రాన్ హిట్‌మెయిర్, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, చాహల్

Story first published: Saturday, March 23, 2019, 14:06 [IST]
Other articles published on Mar 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+